Rashi Khanna : జిమ్ములో రాశి ఖన్నా వర్కౌట్లు.. అందాలు చూసి కుర్రకారు బల్బులు ఔట్
Rashi Khanna : తెలుగు ఇండస్ట్రీ బ్యూటీ రాశీ ఖన్నా గురించి తెలియని వారుండరు. అప్పుడెప్పుడో ఊహలు గుసగుసలాడె సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందర్నీ అలరిస్తూ వస్తోంది. తాను చేసే సినిమాల్లో కొత్త దనం ఉండేలా చూసుకుంటోంది. ఇక ఈ బ్యూటీ అందాల ప్రదర్శనకు అస్సలుకే అడ్డు చెప్పడం లేదు. అయినా ఈ బ్యూటీకి మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. ఒకరిద్దరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటున్న
తరుణంలో ఈ భామ మాత్రం ఆ హోదాకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది.కెరీర్ తొలి నుంచే గ్లామర్ మీద ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్దుర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో వరుసగా , హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.ప్రస్తుత తరం హీరోయిన్లకు ఫిజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయం చాలా మంది ముద్దుగుమ్మలకు అర్థమయే ఉంటుంది. కాబట్టే అందాల తారలంతా సమయం దొరికితే జిమ్స్ లో వర్కౌట్లు చేస్తూ గడిపేస్తుంటారు. ఇందుకు రాశీఖన్నా కూడా మినహాయింపు కాదు.
Rashi Khanna : జిమ్ లో రాశీ హాట్ లుక్స్
రాశీ ఖన్నా జిమ్ లో వర్కౌట్లు చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాశీ ఖన్నా అందాలు కుర్రకారును నిద్దుర లేకుండా చేస్తున్నాయి. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో థ్యాంక్యూ మూవీతో పాటుగా గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న పక్కా కమర్షియల్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని చిత్రాలు కూడా రాశీ ఖన్నా ఒప్పుకోవాల్సి ఉంది. వాటి కథా చర్చలు జరుగుతున్నాయి.