Radhe shyam : ‘రాధే శ్యామ్’ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రాధే శ్యామ్’. డార్లింగ్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ సినిమా. విక్రమాదిత్య గా ప్రభాస్ – ప్రేరణగా పూజా హెగ్డే అద్భుతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. యంగ్ డైరెక్టర్ రాధ కృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రాధేశ్యామ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది.
దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో వంశీ – ప్రమోద్ – ప్రశీద నిర్మిస్తున్నారు. సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు – భాగ్యశ్రి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రాధేశ్యామ్ సినిమా నుంచి టీజర్ రాబోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న టీజర్ మీద చాలా అంచనాలున్నాయి. కాగా తాజాగా టీజర్ డేట్ అండ్ టైం ని ప్రకటిస్తూ ప్రభాస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 18 నిముషాలకి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కంప్లీట్ చేసినట్టు హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది. గత కొన్ని నెలలుగా డిసప్పాయిన్‌మెంట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు మేకర్స్. కాగా ‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్ కు సంబంధించి మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు మ్యూజిక్ సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్ కు అప్పగించారు. ఇప్పటికే బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ మోషన్ టీజర్ కి జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన ఆర్ ఆర్ అదిరిపోయింది.
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
This website uses cookies.