నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి
డైరెక్టర్ : బుబ్చి బాబు సాన
నిర్మాత : మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
రిలీజ్ డేట్ : 12 ఫిబ్రవరి, 2021
Uppena movie review : తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కువగా ఏలుతున్నది వారసులే. అంటే.. తాతలు, తండ్రులు పెద్ద స్టార్ హీరోలు అయి ఉంటే.. కొడుకులు, వాళ్ల కొడుకులు.. వాళ్ల కొడుకులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా సినిమాల్లోకి వాళ్ల పేరు చెప్పుకొని వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే.. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కావాల్సింది బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఒక్కటే కాదు.. తమలో ఉన్న టాలెంట్. అవును.. ఎంత సపోర్ట్ ఉన్నా.. నటన తెలియకపోతే వేస్ట్. అందుకే వారసులుగా వచ్చి.. సక్సెస్ అయ్యేవాళ్లు చాలా తక్కువ. వారసుడిగా చెప్పుకోవడం కన్న.. కష్టపడి మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు.
తాజాగా.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో పంజా వైష్ణవ్ తేజ్.. ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. దాని పేరు ఉప్పెన. ఈ సినిమా మెగా కుటుంబం నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా ఓపెనింగే.. హీరో వైష్ణవ్ తేజ్ గాయాలతో బీచ్ పక్కన పడి ఉంటాడు. వెంటనే ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోతాడు. అక్కడ హీరో ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది. చేపల కోసం ఓ గ్యాంగ్ తో ఫైట్ చేస్తూ హీరో ఇంట్రడక్షన్ ను చూపిస్తారు. ఆ తర్వాత ఓ కాలేజీలో హీరోయిన్ కృతి శెట్టి ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది.
ఆసి(వైష్ణవ్ తేజ్), బేబమ్మ(కృతి శెట్టి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఈ విషయం రాయనం(విజయ్ సేతుపతి)కి తెలుస్తుంది. రాయనం.. బేబమ్మ నాన్న. దీంతో వాళ్లిద్దరినీ విడదీయడం కోసం ఎన్నో పన్నాగాలు పన్నుతుంటాడు. తమను విడదీయడం కోసం రాయనం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న ఈ ప్రేమ జంట ఏం చేస్తుంది. వాళ్లు చేసిన పనికి రాయనం తలెత్తుకోకుండా ఎందుకు అవుతాడు. ఆ తర్వాత ఇద్దరినీ వెతకడం కోసం ఏం చేస్తాడు? పట్టుకున్నాక ఇద్దరినీ ఏం చేశాడు? కన్నకూతురు అని కూడా చూడకుండా బేబమ్మను రాయనం ఏం చేస్తాడు? అనేదే ఈ సినిమా కథ.
సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరు హీరో, హీరోయిన్లు ఇద్దరూ మొదటి సారి నటించినా.. వాళ్లలో ఆ భయం మాత్రం లేదు. చాలా ఈజ్ గా ఇద్దరూ నటించేశారు. ఏమాత్రం వణుకు లేకుండా కెమెరా ముందు తమ సహజ నటనను ప్రదర్శించారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. ఇద్దరూ తమ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి.
ముఖ్యంగా సినిమా గురించి ప్రపంచానికి తెలిసిందే నీ కన్ను నీలి సముద్రం అనే పాట వల్ల. ఆ పాటతోనే సినిమా ఫేమస్ అయింది. థియేటర్ లో ఆ పాట వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులు ఈలలతో ఉర్రూతలూగుస్తున్నారు. ఇక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. ముఖ్యంగా విజయ్ సేతుపతి సీన్లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దేవిశ్రీప్రసాద్ కెరీర్ లో నిలిచిపోయే చిత్రాల్లో ఉప్పెన ఒకటి.
సినిమాకు ప్లస్ పాయింట్స్ హీరో హీరోయిన్స్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, క్లయిమాక్స్. ఈ సినిమాలో క్లయిమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే.. ఈ సినిమాకు క్లయిమాక్సే ప్రాణం. ఎవ్వరూ ఊహించని క్లయిమాక్స్ అది.
అయితే.. కొందరు ప్రేక్షకులకు క్లయిమాక్స్ నచ్చకపోవచ్చు కానీ.. సినిమాకు హైలెట్ అంటే అదే. అది లేకుంటే సినిమానే లేదు.
సినిమాకు మరో ప్లస్ పాయింట్.. డైరెక్టర్ బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే బుచ్చిబాబు వేరే లేవల్ సినిమా తీశాడు. బుచ్చిబాబు టేకింగ్ మరో లేవెల్. మొదటి సినిమాతోనే బుచ్చిబాబు మంచిమార్కులు కొట్టేశాడు.
సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కాస్త వెతకాల్సిందే. ఎందుకంటే.. సినిమా మరాఠీ మూవీ సైరాట్, ఓటీటీ సినిమా కలర్ ఫోటో కు కాపీ అంటున్నారు. ఆ సినిమాలు రాకపోయి ఉంటే.. ఈ సినిమా హిట్ అయి ఉండేది అంటున్నారు. కానీ.. ఏ సినిమా స్టోరీ దానిదే. స్టోరీ లైన్ సేమ్ కావచ్చు కానీ.. ఆ సినిమాల కాపీ అయితే ఈ సినిమా కాదు.
కొన్ని కొన్ని చోట్ల సీన్లు బాగా లాగ్ అయ్యాయి. సినిమాలో విజయ్ సేతుపతి కేవలం ఒక అర్ధగంట మాత్రమే కనిపిస్తారు. ఆయన్ను డైరెక్టర్ ఇంకొంచెం వాడుకొని ఉంటే బాగుండేది. అంతకుమించి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అయితే లేవు.
కన్ క్లూజన్ చెప్పాలంటే.. ప్రేమ కథలను ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను ఖచ్చితంగా ఇష్టపడతారు. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మ్యూజిక్ లవర్స్ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి థియేటర్లలో మంచి సినిమాలు లేవు కాబట్టి.. ఏం చక్కా థియేటర్ కు వెళ్లి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయాలంటే వెంటనే ఉప్పెన సినిమాకు వెళ్లిపోండి. నో డౌట్. హ్యాపీగా ఓ ప్రేమకథను ఫీల్ అయి వస్తారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.