Radhe shyam : రాధేశ్యామ్ .. టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – సౌత్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరి. పదేళ్ళ తర్వాత ప్రభాస్ యాక్షన్ సినిమాలని పక్కన పెట్టి రాధేశ్యామ్ చేస్తుండటం ఆసక్తికరమైన విషయం. అంతేకాదు ప్రభాస్ కెరీర్‌లో మళ్ళీ రాధేశ్యామ్ లాంటి సినిమా చేసే అవకాశం రాకపోవచ్చు అన్న మాట వినిపిస్తోంది. అంతగా ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. జిల్ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
రాధేశ్యామ్ సినిమా నుంచి బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ టీజర్ వచ్చిప్పుడే ప్రభాస్ అమర ప్రేమికుడిగా నటిస్తున్నట్టు హింట్ ఇచ్చాడు దర్శకుడు. టీజర్ ప్రారంభంలో లైలా – మజ్ఞు, సలీం – అనార్కలీ, దేవదాస్ – పారులను రివీల్ చేశాక విక్రమాదిత్య – ప్రేరణలను రివీల్ చేసి రాధేశ్యామ్ మేయిన్ థీం ఏంటో హింట్ ఇచ్చాడు. అంటే వారంత గొప్ప ప్రేమ రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య – ప్రేరణలది అని అర్థమవుతోంది. చెప్పాలంటే ఇలాంటి ప్రేమ కథలు చాలా వచ్చాయి. కానీ ఇందులో సంథింగ్ స్పెషల్ ఉండబోతోందని చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతోంది.
కాగా ఆ సంథింగ్ స్పెషల్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ పెద్ద కార్ల కంపెనీ ఓనర్ విక్రమాదిత్యగా పూజా హెగ్డే డాక్టర్ ప్రేరణగా కనిపించబోతున్నారట. విక్రమాదిత్యకి ప్రమాదం జరిగి హాస్పిటల్‌కి వచ్చినప్పుడు డాక్టర్ ప్రేరణని చూసి ఫస్ట్ లుక్‌లోనే ప్రేమలో పడతాడట. అయితే ఆ తర్వాత వీరి ప్రేమలో అనుకోని సంఘటనలు జరిగి ఇద్దరిలో ఒకరు చనిపోతారని తెలుస్తోంది. ఈ నేపథ్యాన్ని దర్శకుడు ఆధ్యంతం ఎంతో ఆసక్తిగా చూపించాడని హాలీవుడ్ సినిమా తరహాలో రాధేశ్యామ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.