Puri jagannaadh : పూరి జగనాధ్ జెట్ స్పీడ్‌లో సినిమా చేస్తాడని ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఇటు సౌత్ గాని అటు నార్త్ గాని ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరిలో ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోకుండా సినిమా తీసే దర్శకుడంటే అది ఒక్క పూరి మాత్రమే. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తాడు. హీరోలని ఎలా చూపించాలనుకుంటే అలా చూపిస్తాడు. నువ్వు నంద అయితే నేను బద్రి .. బద్రీనాద్ అయితే ఏంటీ, ఎవడుకొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయిపోద్దో ఆడే పండుగాడు, ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా లేదా, ముంబైలో ఎలాగోలా బతికేయడానికి రాలేదు.. నా పేరు శివమణి .. నా కొంచెం మెంటల్, నాకు దిమాక్ మే దిమాకుంది..ఇలాంటి డైలాగులు పూరి పెన్ను నుంచే వస్తాయి.
పూరి సినిమాలను చూస్తే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. దర్శకుడిగా ఏ ఒక్క స్టార్ డైరెక్టర్ సంపాదించలేనంత డబ్బు సంపాదించాడు. ఎవరు పోగొట్టుకోలేనంత పోగొట్టుకున్నాడు. అప్పుడే అసలు ఎవరో.. నకిలీ ఎవరో తెలుసుకున్నాడు. ఇక పూరి సినిమాలకి ప్రేక్షకులే కాదు.. హీరోలు, దర్శకులలోను ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే. బాలీవుడ్‌లో ఇన్నేళ్ళలో అమితాబ్ బచ్చన్‌ని అంత ఎనర్జిటిక్‌గా చూపించిన దర్శకుడంటే ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. బుడ్డా హోగా తేరే బాప్..బాలీవుడ్‌లో ఊపేసిన సినిమా.
ఈ సినిమా తర్వాత బిగ్ బి కూడా పూరికి ఫ్యాన్ అయిపోయాడు. అంత క్రేజ్ ఉన్న పూరి జగన్నాధ్ మళ్ళీ బాలీవుడ్‌లో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పూరి నెక్స్ట్ సినిమా ఉండబోతోందట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ్‌తో లైగర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్ ..ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్‌తో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడట. టాలీవుడ్‌లో పూరి – మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమాని సల్మాన్ ఖాన్ వాంటెడ్‌గా రీమేక్ చేసి భారీ హిట్ అందుకున్నాడు. చూడాలి మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.