Chandramukhi 2 : రజనీకాంత్ నే కాదు మొత్తం మార్చేశారుగా..!
Chandramukhi 2 : సూపర్ స్టార్ రజనీకాంత్ భారీ హిట్ అందుకున్న సినిమా చంద్రముఖి. కన్నడలో వచ్చిన ఆప్తమిత్ర ఆధారంగా కథా రచయిత, దర్శకుడు పి వాసు ఈ సినిమాను రూపొందించారు. అయితే రజనీకాంత్ తనది ప్రధాన పాత్ర కాకపోయినా ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం తన ప్రాణ స్నేహితుడు నటుడు ప్రభు. అప్పట్లో ఆయన ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సినిమా చేస్తే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారనే ఆలోచనతో తన స్నేహితుడు కోసం రజనీకాంత్ చంద్రముఖి సినిమా ఒప్పుకున్నారు. అయితే, కన్నడ కథకు తమిళ కథకు కొన్ని కీలక మార్పులు చేశారు.
ఇక్కడ కథను అటు తెలుగు, ఇటు తమిళ ప్రేక్షకులకు అనుగుణంగా రజినీకాంత్ ఇమేజ్‌కు సరిపోయేలా సన్నివేశాలు మార్చి ఆయన పాత్ర బాగా హైలెట్ అయ్యేలా దర్శకుడు వాసు చంద్రముఖి సినిమాను తీశారు. ఈ సినిమా రిలీజైన మొదటి రోజునుంచే భారీ హిట్ అని టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో చంద్రముఖి పాత్రలో నటించిన జ్యోతిక నటన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇక సైక్యార్టిస్ట్ గా, వేంకటపతి మహారాజాగా రజనీ నటన మహాద్భుతం. సంగీత దర్శకుడు విద్యాసాగర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణంగా నిలిచాయి. తెలుగు, తమిళ భాషలలో భారీ వసూళ్ళు రాబట్టింది.

Raghava Lawrence Replaces Rajinikanth in Chandramukhi 2
Chandramukhi 2 : వీళ్ళెవరూ సీక్వెల్‌లో నటించడం లేదు.
అయితే, ఈ సినిమా సీక్వెల్‌గా తెలుగులో విక్టరీ వెంకటేశ్ నాగవల్లి అంటూ చేసి ఫ్లాప్ అందుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ళకు చంద్రముఖి 2 రాబోతుందని సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సీక్వెల్‌కు దర్శకుడు పి వాసు. అయితే, చంద్రముఖిలో నటించిన రజనీకాంత్ సహా మరే ముఖ్య పాత్ర ఇందులో లేకపోవడం షాకింగ్ విషయం. జోతిక, నయనతార, మాళవిక, ప్రభు, కె ఆర్ విజయ …వీళ్ళెవరూ సీక్వెల్‌లో నటించడం లేదు. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ మేయిన్ లీడ్ రోల్ చేయబోతున్నారు. ఒక్క వడివేలు మాత్రమే సీక్వెల్ మూవీలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు కూడా మారిపోయి ఆ స్థానంలో మన దిగ్గజ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సైయ్యారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.