Home » Entertainment » Raghavendra Rao On Anasuya And Sudheer In Star Maa Singing Show
Entertainment

Anasuya : అనసూయను ఆ పండుతో పోల్చేశాడు.. దర్శకేంద్రుడు మామూలోడు కాదు

Authored By
aruna
The Telugu News | Published on: August 25, 2022, 12:40 pm
Advertisement

Anasuya  : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అంటే తెలుగు వారందరికీ కూడా పూలు, పళ్లు, రొమాన్స్, శోభనం గదిలో అగరొత్తుల పొగలు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. పాటల చిత్రీకరణలో దర్శకేంద్రుడి శైలి ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. హీరోయిన్ల నడములు, బొడ్ల మీద పూలు, పళ్లు వేస్తూ వింతగా క్రియేట్ చేస్తుంటాడు రాఘవేంద్ర రావు. ఇన్నేళ్లు అయినా కూడా ఆ ఫార్మూలాను మార్చడం లేదు.దర్శకేంద్రుడు తీసిన సినిమాలు హిట్ అయి చాలా కాలమే అవుతోంది.

Advertisement

ఓ దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుంచి దర్శకేంద్రుడు ఓ హిట్ కోసం పరితపిస్తున్నాడు. కానీ ఆయన ఖాతాలో మాత్రం హిట్ పడటం లేదు. వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో నటుడిగానూ మారాడు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. ఈ చిత్రం దారుణాతి దారుణంగా బోల్తా కొట్టేసింది. తెర నిండా నటులున్నారు.కానీ సినిమాలో కథ లేకుండా పోయింది. దీంతో వాంటెడ్ పండుగాడ్‌ను జనాలు చీ కొట్టేశారు. ఈ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు స్టార్ మా సింగింగ్ షోను వాడుకున్నారు.

Raghavendra Rao On Anasuya And Sudheer in Star Maa Singing Show

Advertisement

ఈ షోకు వాంటెడ్ పండుగాడ్ టీం వచ్చింది. సుధీర్, అనసూయలు ఎలాగూ ఈ షోకు హోస్ట్లు. రాఘవేంద్ర రావు, శ్రీనివాస్ రెడ్డి, దీపిక పిల్లి వంటి వారు వచ్చారు. ఇక ఇందులో ఒక్కొక్కరినీ ఒక్కో పండుతో పోల్చాడు రాఘవేంద్రరావు. సుధీర్ కొబ్బరి కాయలాంటివాడట. అనసూయ అయితే.. పుచ్చకాయలాంటిదట. అదేంటి సర్ అని అనసూయ ఆశ్చర్యపోతే.. శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇస్తాడు. లోపల అంతా కూడా ఎర్రగా ఉంటుంది కదా? అందుకే అని అంటాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి