Home » Entertainment » Rahul Sipligunj Ashu Reddy Latest Pic On Ooko Kaka Launch
Entertainment

ఇది అరాచకం.. రాహుల్‌ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి!!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 17, 2021, 4:30 pm
Advertisement

బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ అషూ రెడ్డిలు ఇప్పుడు సోషల్ మీడియాను ఏలేస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇంత క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించలేదు. కానీ బయటకు వచ్చాక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఇద్దరి మధ్య బంధం బలపడుతూ వచ్చింది. అప్పటి వరకు రాహుల్ పునర్నవి అనే వారు. ఇప్పుడు అసలు ఆ మాటే వినిపించడం లేదు.

Advertisement

Rahul Sipligunj Ashu Reddy latest pic On ooko kaka Launch

ఎక్కడ చూసినా రాహుల్ అషూ రెడ్డి అని అంటున్నారు. ఈ జంటకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చకు వారి అభిమానులు కూడా అనుమాన పడుతున్నారు. ఇద్దరు ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతోన్నారా? అని అడిగేస్తున్నారు. తామిద్దరం మంచి దోస్తులం అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్లు ఆగడం లేదు. ఆ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం ఆగడం లేదు. మొత్తానికి మళ్లీ ఈ ఇద్దరూ వార్తల్లో వైరల్ అయ్యారు.

Advertisement

రాహుల్ సిప్లిగంజ్ తన ఊకో కాక బ్రాండ్‌ వ్యాల్యూను పెంచుకునేందుకు ఓ షాపును హైద్రాబాద్‌లో కూడా లాంచ్ చేశాడు. దానికి అషూను ముఖ్య అతిథిగా పిల్చుకున్నాడు. అక్కడికి వచ్చిన అషూతో రాహుల్ రచ్చ చేశాడు. ఏకంగా అషూను ఎత్తుకున్నాడు. అషూ కూడా రాహుల్ మీదకు ఎక్కేసింది. నిజమైన ఫ్రెండ్‌కు మన వీక్ నెస్ తెలుసు.. కానీ ఎప్పుడూ మన బలాన్ని మాత్రం బయటకు చెబుతుంది.. మజాక్ కాదు కాక ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలే.. నాకెంతో నమ్మకాన్ని ఇస్తుంది.. అషూ మా స్వాగతం అంటూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి