Home » Entertainment » Rahul Sipligunj Comments On Bigg Boss Season Five
Entertainment

Rahul Sipligunj : బిగ్‌బాస్‌లో వార్ వ‌న్‌సైడే.. అత‌ని గేమ్‌కు రాహుల్ సిప్లిగంజ్ ఫిదా

Authored By
mallesh
The Telugu News | Published on: December 4, 2021, 5:50 pm
Advertisement

Rahul Sipligunj : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆట చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేసి తామే టైటిల్ గెలుచుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే టైటిల్ విన్నర్ ఎవరవుతారో అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.చివరి దశలో సత్తా చాటేందుకుగాను కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టైటిల్ ఎవరు గెలుస్తారు అనే విషయమై నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు.

Advertisement

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సైతం తన అభిప్రాయం తెలిపాడు. ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్‌లో వార్ వన్ సైడ్ అయిందని కామెంట్ చేశారు. తాను అతడి ఆటకు ఫిదా అయినట్లు తెలిపాడు. ఆ కంటెస్టెంట్ ఎవరంటే..సీజన్ ఫైవ్ విన్నర్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ అని సోషల్ మీడియాలో చాలా మంది నెటజన్లు పేర్కొంటున్నారు. కాగా, తాను మాత్రం సన్నీ గేమ్‌కు ఫిదా అయినట్లు రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ షోలో వార్ వన్ సైడ్ అయిందని, హార్ట్ సింబల్ పోస్ట్ చేసి ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన అభిప్రాయం తెలిపాడు రాహుల్

Rahul sipligunj comments on Bigg boss season five

Advertisement

Rahul Sipligunj : అంచనాల్లేకుండానే టైటిల్ నెగ్గేంత వరకు అతని ఆట..!

అయితే, నెట్టింట చాలా మంది సిరి, షణ్ముక్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ గురించి.. షణ్ముక్ తప్పకుండా టైటిల్ గెలుచుకుంటాడని డిస్కషన్ చేసుకుంటున్నారు. రాహుల్ సిప్లిగంజ్ తెలిపిన అభిప్రాయం ప్రకారం.. ఎటువంటి అంచనాలే లేకుండా ఆట ఆడిన సన్నీ.. టైటిల్ గెలిచే చాన్సెస్ ఉన్నాయని పలువురు అనుకుంటున్నారు. చూడాలి మరి… టైటిల్ ఎవరు నెగ్గుతారో.. అయితే, బిగ్ బాస్ షోలో ఈ సీజన్‌లో అందరికంటే ఎక్కువగా లైమ్ లైట్‌లోకి వచ్చింది సిరి, షణ్ముక్‌లే. వీరిరువురి మధ్య హగ్‌లు, డిస్కషన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపోతే మధ్యలో షణ్ముక్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయిన ఎంట్రీ ‘సచ్చినోడా’ అంటూ వ్యాఖ్యలు.. ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయని చెప్పొచ్చు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి