
Raghu Rama Krishna Raju To Loose His MP Post
Raghu Rama Krishna Raju : వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తరచూ ఏపీ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేసే సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన లోకసభలో ఏపీ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు చేసిన కంప్లయింట్స్ గురించి చర్చించే ముందర, ఆయన చేసిన పనుల సంగతేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఏపీ అప్పుల గురించి మాట్లాడే రాజు గారు తన సంస్థల ద్వారా బ్యాంకులకు ఎగ్గొట్టిన అప్పుల గురించి మాట్లాడాలని పలువురు అడుగుతున్నారు.
ఎఫ్ఆర్ఎంబీ పరిధికి మించి ఏపీ సర్కారు అప్పులు చేస్తోందని, రాష్ట్రం దివాళా తీయబోతున్నదని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాలను ప్రస్తావించి ప్రధాని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు కూడా ఇస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ ఈ విషయాల గురించి వివరిస్తున్నారు. ఏపీ రాష్ట్రసర్కారు చేసే నిర్వాకం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాగా, ఆయనకు చెందిన కంపెనీలు దాదాపు రూ.700 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కంపెనీపైన కూడా ఇటువంటి ఆరోపణలున్నాయి.
Raghu rama krishna raju complaints on ap govt to central govt
రఘురామకృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందర తన సంస్థలు తిరిగి చెల్లించాల్సిన డబ్బుల గురించి ఎందుకు ఆలోచించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. తొలుత తాను తన సంస్థల ద్వారా చెల్లించాల్సిన డబ్బులను చెల్లించాలని, ఆ తర్వాతనే ఏపీ సర్కారు అప్పుల గురించి మాట్లాడాలని పలువురు అంటున్నారు. నీతులు చెప్పే ముందర ఆచరించి చూపాలని పేర్కొంటున్నారు. నష్టాలు రావడంతో తన సంస్థకు సంబంధించిన అప్పులు చెల్లించలేకపోతున్నానని రఘురామకృష్ణరాజు అనడం సబబు కాదని అంటున్నారు. చూడాలి మరి.. ఏపీ సర్కారుపై రఘురామ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో..
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.