Rathika Rose : బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ రతిక రోస్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. రాహుల్ సిప్లిగంజ్.. అసలు నిజం బయటపడింది

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 10, 2023, 8:00 am

Rathika Rose : రతిక రోస్ తెలుసు కదా. ప్రస్తుతం బిగ్ బాస్ 7 హౌస్ లో తెగ హల్ చల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రతిక రోస్ హౌస్ లో అడుగు పెట్టిన తొలి రోజు నుంచే రచ్చ రచ్చ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేరోజు గ్రాండ్ లాంచ్ రోజే తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. తన ఎక్స్ వల్ల బాధపడ్డానని కూడా చెప్పింది రతిక. అయితే.. ఆ ఎక్స్ ఎవరు నాగార్జున అడిగినా కూడా మీకు తెలియదా అన్నట్టుగా సమాధానం దాటవేసింది రతిక. అయితే.. తన ఎక్స్ ఎవరు అని ఎవరూ తెలుసుకోలేకపోయారు. కానీ.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఇటీవలే తెలిసిపోయింది. అతడు ఎవరో కాదు.. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.బిగ్ బాస్ 3 లోకి రాకముందు అసలు రాహుల్ సిప్లిగంజ్ అంటే కూడా ఎవ్వరికీ తెలియదు. ఒక సింగర్ అని తెలుసు కానీ.. అంతగా జనాల్లో పాపులారిటీ లేని వ్యక్తి.

కానీ.. బిగ్ బాస్ 3 విన్నర్ అయ్యాక రాహుల్ సిప్లిగంజ్ ఫేటే మారిపోయింది. సినిమాల్లో పాడే ఛాన్సులు రావడమే కాదు.. చివరకు ఆస్కార్ అవార్డు రేంజ్ కి ఎదిగాడు రాహుల్ సిప్లిగంజ్. ఆస్కార్ లేవల్ లో రాహుల్ సిప్లిగంజ్ కు పాపులారిటీ వచ్చేసింది. అందుకే రాహుల్ అంటే అమ్మాయిలకు అంత క్రేజీ. రాహుల్, రతిక ఒకప్పుడు ప్రేమలో ఉన్నారట. ఇద్దరూ చాలా డీప్ ప్రేమలో ఉన్నారట. నిజానికి రాహుల్ వల్లనే రతికకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని చెప్పుకోవాలి.అందుకేనేమో రతిక నాగార్జునతో చాలా క్లోజ్ గా మాట్లాడింది. హౌస్ లోను కొంచెం తన డామినేషన్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కూడా రతికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ తన ఎక్స్ అని తనే చెప్పకనే చెప్పింది.

rahul sipligunj is the ex boyfriend of rathiks rose

rahul sipligunj is the ex boyfriend of rathiks rose

Rathika Rose : అందుకే నాగార్జునతో క్లోజ్ గా మాట్లాడిన రతిక

బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా రతిక యాక్టివిటీ రూమ్ కు వెళ్లినప్పుడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కు మ్యూజిక్ అంటే ఇష్టం అంటూ ఓ క్లూ వదిలింది. నాకు పాటలంటే ఇష్టం అని చెప్పడమే కాదు.. నాకు ఇన్నోసెంట్ గా ఉండే వాళ్లు, మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్లంటే ఇష్టం అంటూ బాగానే క్లూలు వదిలింది. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉండాలి అంటూ క్లూలు వదిలేసింది. ఎవరినైనా మిస్ అవుతున్నావా అంటూ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను కొన్నేళ్ల నుంచి మిస్ అవుతున్నా అంటూ కన్నీటి పర్యంతం అవుతుంది రతిక.

ఇంకో విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్, రతిక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లు క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. వీళ్లిద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో.. ఇద్దరూ ఎందుకు విడిపోయారో తెలియదు కానీ.. రాహుల్, రతిక ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారట.

Breaking News 2

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp