RRR : ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన జక్కన్న ..?
RRR : ఆర్ఆర్ఆర్..టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షన్ కథాంశంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమురం భీం గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ..టీజర్స్ సినిమా సత్తా ఏ రేంజ్ లో ఉంటుందో తెలపడమే కాదు భారీ స్థాయిలో అంచనాలు పెంచాయి. చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ తారక్ సరసన బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ నటిస్తోంది.

Rajamouli announced regarding RRR OTT release
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తుండగా ఆయన సరసన సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ కనిపించబోతోంది. వీరు మాత్రమే కాదు ఇతర భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ స్ట్రీమింగ్ డీటైల్స్ వెల్లడయ్యాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ జీ 5 సంస్థ స్ట్రీమింగ్ చేయనుంది. హిందీలో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్‌గా ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలలోకీ నెట్ ఫ్లిక్స్ డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
RRR : ఆర్ఆర్ఆర్ ముందు రిలీజయ్యే ప్రసక్తే లేదని మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం.
శాటిలైట్ రైట్స్ హిందీ వర్షన్‌ను జీ సినిమాకు ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడలో స్టార్ ఛానెల్స్‌లో టెలికాస్ట్ చేస్తారు. అలాగే మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక హిందీలో థియేట్రికల్ రైట్స్‌ను పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ దక్కించుకుంది. కాగా ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే ఓటీటీ రిలీజ్ థియేటర్ రిలీజయిన 70 నుంచి 100 రోజుల తర్వాతే అని తెలుస్తోంది. దానికి ముందు రిలీజయ్యే ప్రసక్తే లేదని మేకర్స్ నుంచి అందుతున్న సమాచారం.