
rajamouli brahmastra movie interesting updates
Brahmastra Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కి చాలా పెద్ద డ్యామేజ్. అవును ఆయన బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాపై చాలా నమ్మకం పెట్టుకొని ఆ సినిమాను సౌత్ ఇండియాలో సమర్పించేందుకు సిద్ధమయ్యాడు. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సౌత్ ఇండియాలో ప్రమోట్ చేసినందుకుగాను భారీ మొత్తంలోనే పారితోషకమును పొందాడు.. ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సినిమా సక్సెస్ అయ్యి ఉంటే, లాభాలను సొంతం చేసుకుని ఉంటే ఆయనకు మరింతగా పారితోషికం రూపంలో ముట్టేది. కానీ సినిమా నిరాశపరిచింది.
అయినా కూడా ప్రస్తుతానికి రాజమౌళికి దక్కిన మొత్తం ఎంతో తెలుసా అక్షరాల రూ. 10 కోట్లు. అవును.. అక్షరాల 10 కోట్ల రూపాయలను ఆయనకు సినిమాను ప్రమోట్ చేయాల్సిందిగా బ్రహ్మాస్త్ర నిర్మాతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ఉత్తర భారతంలో కూడా ఆయన సమర్పిస్తున్నాడు అంటే సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన కాస్త ఖరీదు ఎక్కువైనా కూడా బ్రహ్మాస్త్ర నిర్మాతలు ఆయనతో సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
rajamouli brahmastra movie interesting updates
ఈ విషయంలో బ్రహ్మాస్త్ర టీం మరియు రాజమౌళి ప్రయత్నం విఫలం అయ్యారు అని చెప్పాలి. రాజమౌళి చాలా కష్టపడ్డాడు.. ఎప్పుడూ తన సినిమాల కోసం చేయని పనులు చేశాడు. ఈటీవీలో ప్రసారం అయ్యే క్యాష్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని బ్రహ్మాస్త్ర సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. అయినా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సినిమా ఫ్లాప్ అవడం వల్ల రాజమౌళి ఖాతాలో ఒక ఫ్లాప్ పడ్డట్లు అయింది. కానీ ఆయనకు పెద్దగా కష్టపడకుండానే భారీ మొత్తంలో డబ్బు అయితే దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బ్రహ్మాస్త్ర విడుదల తర్వాత రాజమౌళి స్పందన ఏంటి.. ఫ్లాప్ గురించి ఆయన ఏమని మాట్లాడుతాడు.. అసలు సినిమాలు ఎందుకు కమిట్ అవ్వాల్సి వచ్చింది అనే విషయాల గురించి రాజమౌళి మాట్లాడాలని కోరుకుంటున్నారు సినీ జనాలు మరియు ఆయన అభిమానులు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.