Rajamouli : మహేష్ చేసిన పనికి రాజమౌళి ఆగ్రహం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli : మహేష్ చేసిన పనికి రాజమౌళి ఆగ్రహం..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Rajamouli : మహేష్ చేసిన పనికి రాజమౌళి ఆగ్రహం..!

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.1500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మల్టీ-పార్ట్ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయిలో తీయబోతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కోసం రాజమౌళి ఎంతో కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మహేష్ బాబు గ్లోబల్ స్టార్‌గా ఎదగనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Rajamouli మహేష్ చేసిన పనికి రాజమౌళి ఆగ్రహం

Rajamouli : మహేష్ చేసిన పనికి రాజమౌళి ఆగ్రహం..!

Rajamouli : మహేష్ విషయంలో హర్ట్ అయినా రాజమౌళి.. ఎందుకంటే !

అయితే తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు ఇటలీకి వెళ్లిన విషయం రాజమౌళికి అంతగా నచ్చలేదట. షూటింగ్ షెడ్యూల్‌ మధ్యలో అయినా, ముందుగా చెప్పినా సరే, రాజమౌళి వద్దని చెప్పినప్పటికీ మహేష్ వినకపోవడం ఆయనను నిరాశకు గురిచేసిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. టూర్ ముగించుకొని తిరిగి వచ్చేసినా, షూటింగ్ టైమ్‌లో హీరో అందుబాటులో ఉండకపోవడం రాజమౌళికి ఇష్టపడని అంశంగా చెబుతున్నారు. డిసిప్లిన్‌కు ప్రాధాన్యత ఇచ్చే రాజమౌళి వంటి దర్శకుడికి ఇది కొంతవరకు నిరాశను కలిగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు రాజమౌళి జపాన్, ఇండియా, యూరప్ లొకేషన్లలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ప్రముఖులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఇప్పటివరకు సినిమా విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాకపోయినా, కొన్ని ఫోటోలు లీక్ కావడం వల్ల రాజమౌళి ప్రత్యేక దృష్టి పెట్టి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా మహేష్ కెరీర్‌లో గేమ్‌చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది