RRR Movie : నేడే ఆర్‌ఆర్‌ఆర్ విడుదల… ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు

RRR Movie  : టైటిల్ చూసి అవాక్కయ్యారా.. అన్ని సక్రమంగా జరిగి ఉంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా ఓ హాలీవుడ్‌ సినిమా రేంజ్‌ లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్‌ఆర్ సినిమా విడుదల అయ్యి ఉండేది. బాహుబలి సినిమా ల తర్వాత రాజమౌళి రేంజ్ ఏంటీ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆయన స్థాయి ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది. అద్బుతమైన ఆయన టేకింగ్‌.. స్టోరీ టెల్లింగ్‌ సినిమా స్థాయిని అమాంతం ఆయన అభిమానులను పెంచేసింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కు కూడా ఆయన సినిమాలంటే.. ఆయన సినిమాల టేకింగ్‌ అంటే ఇష్టంగా చెప్పుకుంటారు.

దేశ వ్యాప్తంగా నేడు ఏ రాజకీయాలు.. ఏ విదేశీ సమస్యలు.. ఏ సోషల్‌ ఇష్యూ చర్చించకుండా కేవలం ఆర్ ఆర్‌ ఆర్‌ అనే సినిమా గురించి మాత్రమే చర్చించే వారు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా దాదాపుగా 85 శాతం థియేటర్ ల్లో ఈ సినిమా విడుదల అయ్యి ఉండేది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం థియేటర్లలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యి ఉండేది. ముందు రోజే అమెరికాలో ప్రీమియర్ అయ్యి ఉండేది కనుక సోషల్‌ మీడియాలో వారు షేర్ చేసుకున్న విషయాలను ఇండియాలో ఉన్న వారు చర్చించుకుంటూ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసేవారు.బెనిఫిట్ షో లు.. ఎర్లీ మార్నింగ్‌ షో లు అదనపు షో లు ఇలా ప్రతి ఒక్క షో కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కనుక పక్క రాష్ట్రాల నుండి కూడా తరలి వచ్చి సినిమాలు చూసి వెళ్లే వారు.

Rajamouli Ram charan ntr RRR movie release today

RRR Movie : టాలీవుడ్‌ సూపర్ స్టార్‌లు చరణ్‌, ఎన్టీఆర్‌ల ‘ఆర్ఆర్‌ఆర్‌’

ఇంత హడావుడిని మనం మిస్ అయ్యాం. దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి సినిమాను ప్రమోట్‌ చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా దెబ్బేసింది. కరోనా థర్డ్‌ వేవ్‌ తో ఉత్తర భారతం మొత్తం మూతపడే పరిస్థితి వచ్చింది. అందుకే సినిమా ను వాయిదా వేయక తప్పలేదు అంటూ రాజమౌళి టీమ్ కాస్త బాధతోనే రిలీజ్ ను పోస్ట్‌ పోన్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో ఇద్దరు టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ లు రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటించడం వల్ల ఇద్దరు హీరోల అభిమానులు ఏ రేంజ్ లో థియేటర్ల వద్ద సందడి చేసే వారు.

ఆ హీరో థియేటర్‌ లో సందడి.. ఈ హీరో థియేటర్ లో సందడి అన్నట్లుగా అభిమానులు థియేటర్లను పంచుకుని మరీ అలంకరించుకుని హడావుడి ని పోటా పోటీగా చేసే వారు. ఆ సందడి అంతటిని నేడు మిస్ అయ్యాం. సరికొత్త రికార్డులకు సంబంధించిన వార్తలను మనం మిస్ అయ్యాం.. టీవీ9 వంటి న్యూస్ ఛానెల్స్ అన్ని కూడా లైవ్ లు వేసి సినిమా విడుదల గురించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తూ ఉండే వారు. అన్నీ అన్నింటికి అన్నీ కూడా మనం మిస్‌ అయ్యాం. అయితే రాజమౌళి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అదే హడావుడి ఉంటుంది కనుక మళ్లీ విడుదల అయినప్పుడు ఆ హడావుడిని ఎక్స్ పీరియన్స్ చేద్దాం.. ఎవరు కూడా నిరాశ చెందకండి.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

2 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

14 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

16 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

20 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

23 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago