RRR Movie : నేడే ఆర్‌ఆర్‌ఆర్ విడుదల… ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు
RRR Movie : టైటిల్ చూసి అవాక్కయ్యారా.. అన్ని సక్రమంగా జరిగి ఉంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్‌ఆర్ సినిమా విడుదల అయ్యి ఉండేది. బాహుబలి సినిమా ల తర్వాత రాజమౌళి రేంజ్ ఏంటీ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆయన స్థాయి ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది. అద్బుతమైన ఆయన టేకింగ్.. స్టోరీ టెల్లింగ్ సినిమా స్థాయిని అమాంతం ఆయన అభిమానులను పెంచేసింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా ఆయన సినిమాలంటే.. ఆయన సినిమాల టేకింగ్ అంటే ఇష్టంగా చెప్పుకుంటారు.
దేశ వ్యాప్తంగా నేడు ఏ రాజకీయాలు.. ఏ విదేశీ సమస్యలు.. ఏ సోషల్ ఇష్యూ చర్చించకుండా కేవలం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా గురించి మాత్రమే చర్చించే వారు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా దాదాపుగా 85 శాతం థియేటర్ ల్లో ఈ సినిమా విడుదల అయ్యి ఉండేది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి ఉండేది. ముందు రోజే అమెరికాలో ప్రీమియర్ అయ్యి ఉండేది కనుక సోషల్ మీడియాలో వారు షేర్ చేసుకున్న విషయాలను ఇండియాలో ఉన్న వారు చర్చించుకుంటూ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసేవారు.బెనిఫిట్ షో లు.. ఎర్లీ మార్నింగ్ షో లు అదనపు షో లు ఇలా ప్రతి ఒక్క షో కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కనుక పక్క రాష్ట్రాల నుండి కూడా తరలి వచ్చి సినిమాలు చూసి వెళ్లే వారు.
RRR Movie : టాలీవుడ్ సూపర్ స్టార్‌లు చరణ్, ఎన్టీఆర్‌ల ‘ఆర్ఆర్‌ఆర్’
ఇంత హడావుడిని మనం మిస్ అయ్యాం. దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి సినిమాను ప్రమోట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా దెబ్బేసింది. కరోనా థర్డ్ వేవ్ తో ఉత్తర భారతం మొత్తం మూతపడే పరిస్థితి వచ్చింది. అందుకే సినిమా ను వాయిదా వేయక తప్పలేదు అంటూ రాజమౌళి టీమ్ కాస్త బాధతోనే రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్ లు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు నటించడం వల్ల ఇద్దరు హీరోల అభిమానులు ఏ రేంజ్ లో థియేటర్ల వద్ద సందడి చేసే వారు.
ఆ హీరో థియేటర్ లో సందడి.. ఈ హీరో థియేటర్ లో సందడి అన్నట్లుగా అభిమానులు థియేటర్లను పంచుకుని మరీ అలంకరించుకుని హడావుడి ని పోటా పోటీగా చేసే వారు. ఆ సందడి అంతటిని నేడు మిస్ అయ్యాం. సరికొత్త రికార్డులకు సంబంధించిన వార్తలను మనం మిస్ అయ్యాం.. టీవీ9 వంటి న్యూస్ ఛానెల్స్ అన్ని కూడా లైవ్ లు వేసి సినిమా విడుదల గురించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తూ ఉండే వారు. అన్నీ అన్నింటికి అన్నీ కూడా మనం మిస్ అయ్యాం. అయితే రాజమౌళి సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అదే హడావుడి ఉంటుంది కనుక మళ్లీ విడుదల అయినప్పుడు ఆ హడావుడిని ఎక్స్ పీరియన్స్ చేద్దాం.. ఎవరు కూడా నిరాశ చెందకండి.