Home » Entertainment » Rajamouli Rrr Movie And The Kashmir Files Collections Clash
Entertainment

RRR Movie : ఆర్‌ఆర్ఆర్‌ ది కశ్మీర్‌ ఫైల్స్ డబ్బింగ్ టెన్షన్‌.. జక్కన్న స్పందన ఏంటీ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 22, 2022, 7:00 pm
Advertisement

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25 వ తారీకున విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మార్చి 25 వ తారీఖున రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

Advertisement

కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకు కచ్చితంగా భారీ క్రేజ్ అయితే ఉంది, కానీ… ఇటీవలే విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా జక్కన్న సినిమా ని టెన్షన్ పెడుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో జక్కన్న తన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ని ది కశ్మీర్‌ ఫైల్స్‌ నుండి కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడు.. ఆ సినిమాను కాదని తన సినిమాకు ప్రేక్షకులు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

rajamouli RRR movie and the kashmir files collections clash

Advertisement

ఈ సమయంలో రాజమౌళి అనధికారికంగా మాట్లాడుతూ కచ్చితంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక మంచి సినిమా.. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పటికే ఆ సినిమా విడుదలై రెండు వారాలు అయింది.. కనుక కచ్చితంగా మా సినిమాకు ఆ సినిమా వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. నిజంగానే ఇప్పటికే రూ. 200 కోట్లు వసూలు దక్కించుకున్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మూడవ వారంలో కూడా సందడి చేస్తుందని ఏ ఒక్కరు నమ్మడం లేదు. కనుక దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా జక్కన్న ఆర్‌ ఆర్ ఆర్ సినిమా కి పోటీ లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి