RRR Movie : ఒకటి మిస్ అయితే మరొకటి ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసిన రాజమౌళి..!
RRR Movie : బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కించాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆ మధ్య ప్రకటించింది. దీంతో జనవరి 7న విడుదలకానున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.
RRR Movie ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..
సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో రాజమౌళి తాజాగా బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చారు. చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాను మార్చి 18, 2022న విడుదల చేయనున్నామని, కుదరని పక్షంలో ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో అటు రామ్ చరణ్‌తో పాటు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఖుషీ అవుతున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.

rajamouli set two release dates For RRR Movie
చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఊహాత్మక కథతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.