Home » Entertainment » Rajanna Annie Gives Clarity About His Career
Entertainment

Rajanna : రాజ‌న్న చైల్డ్ ఆర్టిస్ట్‌కి సినిమా ఆఫ‌ర్స్ రావ‌ట్లేదా, లేదంటే ఆమెనే చేయ‌డం లేదా?

Authored By
Sam C
The Telugu News | Published on: January 24, 2022, 2:00 pm
Advertisement

Rajanna : మలయాళ కుటుంబానికి చెందిన బేబీ ఆనీ తనకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నటించడం మొదలు పెట్టింది. 2005 లో వచ్చిన అనుకోకుండా ఒక రోజు సినిమాలో ట్యూషన్ స్టూడెంట్ గా కనిపించింది. జగపతి బాబు, ఛార్మి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో త‌న న‌ట‌న‌తో అల‌రించింది. ఆ తరువాత చిరంజీవి , మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టాలిన్ మూవీలో చిరంజీవి ఫ్రెండ్ కూతురు పాత్ర చేశారు. మహేష్ తో సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన అతిథి మూవీలో చిన్నప్పటి హీరోయిన్ పాత్ర చేశారు.

Advertisement

స్వాగతం,రెడీ, శౌర్యం, మిత్రుడు, ఏక్ నిరంజన్, కేడి వంటి చిత్రాలలో నటించింది. అలాగే ఓ భోజ్ పురి మూవీలో కూడా ఆమె నటించారు. నాగార్జున హీరోగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజన్న మూవీలో అన్ని ప్రధాన పాత్ర చేశారు. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన రాజన్న మూవీ మొత్తం అన్ని చుట్టే తిరుగుతుంది. రాజన్న పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ.. నటి అన్నికి మంచి తెచ్చిపెట్టింది. 2018లో విడుదలైన బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీలో అన్ని చరణ్ చెల్లెలి పాత్ర చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం భారీ విజయాన్ని నమోదు చేసింది. అలాగే జీ 5లో ప్రసారమైన లూజర్ తెలుగు వెబ్ సిరీస్ లో నటించారు.

Rajanna annie gives clarity about his career

Advertisement

Rajanna : ఆఫ‌ర్స్ రావ‌డం లేదా..!

అయితే రాజ‌న్న త‌ర్వాత అన్నీ ఎక్కువ‌గా సినిమాల‌లో క‌నిపించ‌క‌పోవ‌డంపై తాజాగా స్పందించింది ఆనీ. త‌న‌కు ఆఫర్స్ వ‌స్తున్నాయి కాని, మంచి పాత్ర‌లు వ‌స్తే అవి చేద్దామ‌ని అనుకుంటున్నా. మ‌రోవైపు రంగ‌స్థ‌లం, లూజ‌ర్ వ‌చ్చాయ‌ని వాటిలో న‌టించాన‌ని పేర్కొంది ఆనీ. కెరీర్ లో మూడు నంది అవార్డ్స్ అందుకున్న ఆనీ చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. 20ఏళ్ల వయసులో స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ గా తయారైంది అమ్మడు. హీరోయిన్ ఆఫ‌ర్స్ కోసం ట్రై చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి