Nagarjuna : నాగార్జున నన్ను దత్తత తీసుకుంటా అన్నారు.. ఇప్పుడు కనిపించినా గుర్తు పట్టట్లేదు.. రాజన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆనీ

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 20, 2023, 6:00 pm

Nagarjuna : మీకు రాజన్న సినిమా గుర్తుందా? అందులో మల్లమ్మగా నటించిన ఆనీ గుర్తుందా? ఆమె ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. నమ్మరా? నిజం.. ఆమె ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. సినిమాల్లోనే తన సత్తా చాటాలని, సినిమానే కెరీర్ గా ఎంచుకున్న ఆనీ తాజాగా లూజర్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. తను నటించిన లూజర్ విడుదల సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది ఆనీ.

rajanna movie child artist annie about nagarjuna

#image_title

మల్లన్న సినిమా మాత్రమే కాదు.. అప్పట్లో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఆనీ. రాజన్న సినిమా సమయంలో ఆనీ అంటే నాగార్జునకు చాలా నచ్చిందట. అందుకే తనను ఇంటికి తీసుకెళ్తా అని అనేవారట నాగార్జున. తనను దత్తత తీసుకుంటా అనేవారట. వాళ్ల అమ్మను కూడా ఈ విషయం అడిగారట నాగార్జున. ఇక.. రాజన్న సినిమాలో నటించిన తర్వాత 10 ఏళ్లకు ఆనీ నాగార్జునను కలిశారట. ముందు నాగార్జున గుర్తుపట్టలేదట. ఆ తర్వాత గుర్తుపట్టి తనతో మాట్లాడారట.

Nagarjuna : హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఆనీ

ఇక.. ఆనీ ఇండస్ట్రీలోనే హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని అనుకుంటోంది. తనకు సినిమాలు అంటేనే ఇష్టమని డిగ్రీ పూర్తయ్యాక.. ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. తనకు ఇప్పటి వరకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా కొన్ని కథలు నచ్చక, కొందరు డైరెక్టర్లు నచ్చక సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఏది ఏమైనా తన పూర్తి ఫోకస్ మాత్రం సినిమాల మీదనే ఉందని ఆనీ చెప్పుకొచ్చింది. తను లూజర్ వెబ్ సిరీస్ లో రూబీ షెబానా పాత్ర తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చింది ఆనీ.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp