Home » Entertainment » Rajasekhar As Special Guest In Jabardasth Show
Entertainment

Rajasekhar : పిలిచి మరీ పరువుతీస్తున్నారా?.. రాజశేఖర్‌ను ఇమిటేట్ చేసిన కమెడియన్లు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 26, 2022, 8:00 pm
Advertisement

Rajasekhar : యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఈ మధ్య ఓ షోలో తన గురించి చెప్పేశాడు. సుమ క్యాష్ షోలో ఫ్యామిలీ అంతా కూడా కలిసి వచ్చారు. సుమతో పాటు రాజశేఖర్ ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేశారు. అయితే అందులో రాజశేఖర్ తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. సుమ అడిగిన ప్రశ్నకు రాజశేఖర్ చెప్పిన సమాధానాం చాలా మందికే అర్థమవుతుంటుంది.

Advertisement

స్క్రీన్ మీద రాజశేఖర్‌ను చాలా మంది ఇమిటేట్ చేస్తుంటారు. కొందరు వాటిని కావాలనే వెటకారంగా కూడా చేస్తుంటారు. బుల్లితెరపై కామెడీ షోల్లో కూడా రాజశేఖర్‌ను ప్రతీసారి ఇమిటేట్ చేస్తుంటారు. జబర్దస్త్ వంటి షోల్లోనూ పలుమార్లు అలాంటి సీన్లు వచ్చాయి. ఇక సద్దాం అయితే ప్రత్యేకంగా రాజశేఖర్‌ రోల్ చేస్తుంటాడు. కానీ తనకు ఇలాంటివి మాత్రం నచ్చవని చెప్పకనే చెప్పేశాడు.

Rajasekhar As Special Guest In Jabardasth Show

Advertisement

Rajasekhar : జబర్దస్త్ షోలో రాజశేఖర్

తెరపై మిమ్మల్ని ఎవరైనా ఇమిటేట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందని సుమ ప్రశ్న వేసింది. అంకుశంలో రాజశేఖర్‌లా కోపం వస్తుందని చెప్పేశాడు. అంటే తనకు ఇలాంటి ఇమిటేషన్లు అంటే నచ్చవని చెప్పేశాడు. కానీ తాజాగా జబర్దస్త్ షోకు గెస్టుగా వచ్చిన రాజశేఖర్ ముందే.. తనలా ఇమిటేషన్లు పెట్టి పరువుతీసేశారు. కానీ రాజశేఖర్ మాత్రం ఈ షోకు గెస్టుగా రావడం పుణ్యమని చెప్పేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి