Home » Entertainment » Rajeev Kanakala On Naga Chaitanya And Samantha Divorce
Entertainment

Rajeev kanakala : సమంత, చైతూ విడాకులపై స్పందించిన రాజీవ్ కనకాల

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 20, 2021, 4:09 pm
Advertisement

Samantha : సమంత, నాగ చైతన్య విడాకులు ఇష్యూ ఇప్పటీకి కొందరికీ మింగుడు పడటం లేదు. విడాకులు తీసుకున్నాం.. ఎవరికి వారు బతుకుదామని నిర్ణయించుకున్నామని చైసామ్ ప్రకటించారు. భార్యాభర్తలుగా ఉండలేమని, ఇకపై కేవలం స్నేహితుల్లా తమ బంధాన్ని కొనిసాగిస్తామని చెప్పేశారు. విడాకులపై అధికారిక ప్రకటన రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే విడాకుల ప్రకటనలోనూ చైతన్య, సమంతలది ఇద్దరిదీ ఒకే బాట, ఒకే మాట అన్నట్టుగా సాగింది. ఒకే ప్రెస్ నోట్‌ను వదిలారు.

Advertisement

Rajeev kanakala On Naga Chaitanya And Samantha Divorce

అయితే నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాలో నటించిన రాజీవ్ కనకాల తాజాగా విడాకుల విషయం మీద స్పందించారు. మామూలుగా అయితే రాజీవ్ కనకాల, సుమ వైవాహిక జీవితం మీద కూడా ఎన్నో రకాల రూమర్లు వస్తుంటాయి. ఈ ఇద్దరూ విడిపోయారు అని, వెర్వేరుగా ఉంటున్నారు అని, కేవలం పిల్లల కోసమే అలా మధ్యమధ్యలో కలుస్తుంటారనే రూమర్లు వినిపిస్తుంటాయి. అయితే తాజాగా రాజీవ్ కనకాల చైసామ్ విడాకులపై తన దైన శైలిలో స్పందించాడు.

Advertisement

Rajeev kanakala On Naga Chaitanya And Samantha Divorce

Samantha : విడాకులపై రాజీవ్ కనకాల..

నాగ చైతన్య, సమంత విడాకులు అనేది వారి పర్సనల్. వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. మనకు బాధగా ఉన్నా కూడా ఆ పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడకూడదు అని రాజీవ్ కనకాల అనేశాడు. అయితే చైతూ గురించి మాత్రం ఎంతో గొప్పగా చెప్పేశాడు. చైతూని అమ్మాయిలే కాదు నేను కూడా ప్రేమించాను. ఎంతో మంచి వాడు.. ఎంతో కూల్‌గా ఉంటాడు.. ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడు.. అంత మంచి వాడంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి