Naresh – Pavitra Lokesh : నరేష్ పవిత్రల పెళ్లి గురించి అందరి ముందరా రాజేంద్ర ప్రసాద్ అంత మాట అనేసాడు ఏంటి !
Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అది సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేశ్ పెళ్లి. వాళ్ల పెళ్లి గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. అసలు వాళ్లు పెళ్లి చేసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. నిజానికి.. చాలామంది సెలబ్రిటీలు రెండో పెళ్లి చేసుకున్నారు కానీ.. ఈ వయసులో చేసుకోలేదు. దీంతో అందరి చూపు ప్రస్తుతం నరేష్, పవిత్రల మీద పడింది. ఈ వయసులో పెళ్లి ఏంటి అంటూ నరేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. నరేష్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.
తన తోటి నటులు కూడా నరేష్ పై ఫైర్ అవుతున్నారు. ఈ వయసులో పెళ్లి ఏంటి అంటూ కంగుతింటున్నారు. తాజాగా నరేష్ ను స్టేజ్ మీదనే మరో సీనియర్ నటుడు తన పెళ్లి గురించి ప్రస్తావించాడు. నరేష్ నిత్య పెళ్లి కొడుకు అంటూ విమర్శించాడు. ఆ నటుడు ఎవరో కాదు.. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. అన్నీ మంచి శకునములే అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు రాజేంద్రప్రసాద్.

Naresh – Pavitra Marriage : నరేష్, రాజేంద్రప్రసాద్.. ఇద్దరూ కలిసి నటించిన సినిమా
నరేష్, రాజేంద్రప్రసాద్.. ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. నరేష్ కత్తిలా ఉంటాడని.. మామూలోడు కాదని.. అందరికీ తెలుసు అని.. ఎప్పుడూ పెళ్లి కొడుకులా ఉంటాడని రాజేంద్రప్రసాద్ కామెంట్ చేశారు. దానిపై స్పందించిన నరేష్.. పెళ్లికొడుకులా ఉండటం ఏంటి.. పెళ్లికొడుకునే అంటూ చమత్కరించడంతో స్టేజ్ మొత్తం నవ్వులు విరబూశాయి. ఏది ఏమైనా.. ఇన్ డైరెక్ట్ గా నరేష్ చేసుకున్న నాలుగో పెళ్లి గురించి రాజేంద్రప్రసాద్ కామెంట్ చేసినట్టు స్పష్టమౌతోంది.