Naresh – Pavitra Lokesh : పవిత్ర లోకేష్ – నరేష్ ల మళ్ళీ పెళ్లి సినిమా విషయం లో భారీ ట్విస్ట్ !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 24, 2023, 5:00 pm

Naresh – Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ నటి పవిత్ర లు త్వరలోనే ‘ మళ్ళీ పెళ్ళి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. మళ్లీ పెళ్లి సినిమా మే 26న విడుదల కానుంది. ఈ క్రమంలో పవిత్ర నరేష్ లు సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తాజాగా పవిత్ర ఓ ఇటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను గాని ఎప్పుడు హీరోయిన్ గా నటించాలని అనుకోలేదు.

Naresh and Pavitra Lokesh remarriage is a huge twist in the movie

Naresh and Pavitra Lokesh remarriage is a huge twist in the movie

నా కెరీర్ మొదట్లో హీరోయిన్ గా రెండు సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్ళీ పెళ్లి సినిమాలో మళ్లీ హీరోయిన్ గా నటించాను. మళ్లీ పెళ్లి సినిమా కథ సమాజానికి అద్దం పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఆలోచనలు సమాజంలో వున్నాయి. ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఎం ఎస్ రాజు గారు ఈ కథ చెప్పినప్పుడు నచ్చింది. నరేష్ గారూ నేను కలిసి చేస్తేనే ఇది బావుందని అన్నారు. మా ఇద్దరికీ నచ్చి చేశాం. అలాగే మన సమాజంలో కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఉంటాం. దాన్ని దాటితే బోల్డ్ అంటాం. ఈ రకంగా చూసుకుంటే ఈ సినిమాలో చాలా బోల్డ్ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

Pavitra Lokesh says about Naresh and her real life

ఇంకా ఆమె మాట్లాడుతూ నరేష్ గారు ఎంత సీరియస్ విషయాన్ని అయిన లైట్ తీసుకోని దానికి ఏం కావాలో సీరియస్ గా చేస్తారు. ఆ క్వాలిటీ నాలో లేదు. నేను చిన్న చిన్న విషయాల్ని కూడా సీరియస్ గా తీసుకుంటాను. అన్నింటికంటే ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీని కంటే కావాల్సింది ఏముంది. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. కొంతమంది నా వ్యక్తిత్వాన్ని హననం చేసి నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. నేను ఒంటరిగా ఉంటే సూసైడ్ చేసుకోవాలి. లేదా ఇంట్లో ఒంటరిగా కూర్చోవాలి. నేను బయటికి వచ్చానంటే దానికి కారణం నరేష్ నా వెనుక బలంగా నిల్చున్నాను.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  2. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  3. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  4. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  5. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  6. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  7. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp