
rajendra prasad fire on anchor Manjusha in F3 Movie Success Meet
Rajendra Prasad : ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకి మంచి టాక్ లభించింది. ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఫన్ రైడ్ సెలెబ్రేషన్స్ అంటూ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌ను యాంకర్ మంజూష నడిపించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ వెరైటీగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు వినిపించి చూపించారు. సినిమా హిట్ అవ్వకపోతే మీ ఎవ్వరికీ నా మొహం చూపించను అని నాడు రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలను వీడియోలో ప్లే చేయించి చూపించారు.
అయితే స్టేజ్ మీదకు రాజేంద్ర ప్రసాద్‌ను యాంకర్ మంజూష పిలిచేసింది. వెనుక మాటలు వినిపిస్తుంటే.. రాజేంద్ర ప్రసాద్ మొహానికి మాస్క్ లాంటిది వేసుకుని వచ్చాడు. సర్ మాస్క్ తీసేయండి అని మంజూష అనేసింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ అసహనానికి గురయ్యాడు. ఉండవమ్మా.. నీ గోల.. ఇక్కడ మా గోలే ఎక్కువైందంటే.. మధ్యలో నీ గోల ఏంటి అని అనడంతో యాంకర్ మంజూష పక్కకు వెళ్లిపోయింది. అయితే తాను అలా మాస్క్ వేసుకుని రావడం వెనుకున్న కారణాన్ని చెప్పాడు.
rajendra prasad fire on anchor Manjusha in F3 Movie Success Meet
సినిమా హిట్ అవ్వకపోతే తన మొహాన్ని ఎవ్వరికీ చూపించనని అన్నాను.. కానీ ఇప్పుడు చూపిస్తున్నానంటూ దానర్థం ఏంటి.. సినిమా హిట్ అని చెప్పేశాడు. సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాక ఇంకేం అవుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. మంజూష విషయానికి వస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రాఖీ చిత్రం ద్వారా మంజూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రాఖీ చిత్రంలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించి తన నటనతో అందర్నీ మెప్పించింది. అయితే అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో యాంకరింగ్‌పై దృష్టిపెట్టింది. యాంకర్‌గా అవకాశాలు తలుపుతట్టడంతో స్టార్ యాంకర్‌గా మారింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.