Rajendra Prasad : నీ గోలెంటి అని యాంక‌ర్ మంజూష‌పై రాజేంద్ర ప్ర‌సాద్ ఫైర్..!

Authored By Sam C | The Telugu News | Published on: May 31, 2022, 6:30 pm

Rajendra Prasad : ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రం ఎఫ్ 3. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ సినిమాకి మంచి టాక్ ల‌భించింది. ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఫన్ రైడ్ సెలెబ్రేషన్స్ అంటూ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌ను యాంక‌ర్ మంజూష నడిపించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ వెరైటీగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు వినిపించి చూపించారు. సినిమా హిట్ అవ్వకపోతే మీ ఎవ్వరికీ నా మొహం చూపించను అని నాడు రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలను వీడియోలో ప్లే చేయించి చూపించారు.

Rajendra Prasad : రాజేంద్ర ప్ర‌సాద్ ర‌చ్చ‌..

అయితే స్టేజ్ మీదకు రాజేంద్ర ప్రసాద్‌ను యాంకర్ మంజూష పిలిచేసింది. వెనుక మాటలు వినిపిస్తుంటే.. రాజేంద్ర ప్రసాద్ మొహానికి మాస్క్ లాంటిది వేసుకుని వచ్చాడు. సర్ మాస్క్ తీసేయండి అని మంజూష అనేసింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ అసహనానికి గురయ్యాడు. ఉండవమ్మా.. నీ గోల.. ఇక్కడ మా గోలే ఎక్కువైందంటే.. మధ్యలో నీ గోల ఏంటి అని అనడంతో యాంకర్ మంజూష పక్కకు వెళ్లిపోయింది. అయితే తాను అలా మాస్క్ వేసుకుని రావడం వెనుకున్న కారణాన్ని చెప్పాడు.

rajendra prasad fire on anchor Manjusha in F3 Movie Success Meet

rajendra prasad fire on anchor Manjusha in F3 Movie Success Meet

సినిమా హిట్ అవ్వకపోతే తన మొహాన్ని ఎవ్వరికీ చూపించనని అన్నాను.. కానీ ఇప్పుడు చూపిస్తున్నానంటూ దానర్థం ఏంటి.. సినిమా హిట్ అని చెప్పేశాడు. సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాక ఇంకేం అవుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. మంజూష విష‌యానికి వ‌స్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రాఖీ చిత్రం ద్వారా మంజూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రాఖీ చిత్రంలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించి తన నటనతో అందర్నీ మెప్పించింది. అయితే అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో యాంకరింగ్‌పై దృష్టిపెట్టింది. యాంకర్‌గా అవకాశాలు తలుపుతట్టడంతో స్టార్ యాంకర్‌గా మారింది.

పూర్తి వీడియో కోసం ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి

Sam C

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp