Pooja Hegde : సౌత్, నార్త్ సినిమా ఇండస్ట్రీలలో పిచ్చిగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో పొడుగుకాళ్ళ సుందరు పూజా హెగ్డే ఒకరు. ఇప్పటివరకు ఆమె కెరీర్‌లో నాలుగంటే నాలుగే హిట్స్ దక్కడం ఆశ్చర్యకరమైన విషయం. అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు. అంతకముందు వచ్చిన వాటిలో గద్దలకొండ గణేష్ హిట్ అయినా అందులో ఆమెకు దక్కిన క్రెడిట్ ఏమీ లేదనే చెప్పాలి. ఒక్కపాట నాలుగు సీన్స్ అంటే అసలు హీరోయిన్గా భావించడం కరెక్టే కాదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత వరుసగా పూజా నటించిన పాన్ ఇండియన్ సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా పడుతున్నాయి.
పూజా డేట్స్ ఇస్తే ఓ సినిమా చేసుకుంటా అని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్నారు. బీస్ట్ సినిమా ముందు రాధే శ్యామ్మ్ పెద్ద డిజాస్టర్. అయినా పూజా లక్కీ హీరోయిన్ అన్నారు. ఆ వెంటనే బీస్ట్ ఫ్లాప్ అయింది. అసలు మన తెలుగులో ఈ సినిమాను పట్టించుకున్న నాధుడే లేడు. ఆ తర్వాత ఆచార్య. చరణ్ ఏరికోరి ఈ సినిమాలో పూజా కావాలని పెట్టుకుంటే ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఇలా ఆమె నటించిన పెద్ద సినిమాలన్నీ ఫ్లాపవుతున్నా క్రేజ్ త్తగ్గలేదు. హీరోయిన్‌గా తెలుగులో రెండు పెద్ద సినిమాలున్నాయి. ఒకటి మహేశ్ బాబు, రెండు పవన్ కళ్యాణ్ సినిమా.
అయితే, తెలివిగా పూజా ఐటెం సాంగ్స్ చేసేందుకు ఒప్పుకుంటుంది. ఒక్క సాంగ్ కోసం మూడు రోజులు డేట్స్ ఇస్తే చాలు. కనీసం కోటిన్నర వచ్చి చేతిలో పడుతుందట. అయితే, రంగస్థలం సినిమాలో చేసిన జిగేలు రాణి పాటకు వచ్చిన ఆదరణ ఎఫ్ 3 సినిమాలో పూజా చేసిన పాటకు రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే సినిమాలు మాత్రమే కాకుండా, పూజా హెగ్డే చేస్తున్న ఐటెం సాంగ్స్ కూడా కలిసి రావడం లేదా అంటే ..! అదే అనుకోవాలేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హిందీలో చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ, ఎప్పుడో కమిటైన సినిమాలు ఇంకా పట్టాలెక్కలేదు. సల్మాన్ సరసన ఓ సినిమా మరో స్టార్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇవి హిట్టైతేనే బాలీవుడ్‌లో నెట్టుకొస్తుంది. లేదంటే అక్కడ సర్దుకోవాల్సిందే. ఇక తాజా సమాచారం మేరకు మరో ఐటెం సాంగ్ కమిటయిందట. దీని గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.