Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్..ఈ పేరు అంటే తెలియని వారుండరు. బస్సు కండక్టర్‌గా అతని ప్రస్థానం మొదలు కాగా, ఇప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి.మన దేశంలోనే కాదు అనేక దేశాలలోనే రజనీకాంత్‌కి ఫుల్ ఫ్యాన్స ఉన్నారు. ఆయన సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే చాలు అన్ని చోట్ల పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ విధంగా అన్ని ప్రాంతాల్లో విశేషమైన ప్రేక్షకాభిమానుల ఆదరణ కలిగి ఉన్నారు. రజనీకాంత్‌కి కొన్నాళ్లుగా సక్సస్ లేకపోగా, పెద్దన్న మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం తలైవా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ తో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ థీమ్, అలానే పోస్టర్ ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అనిరుద్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు రజనీకాంత్. అయితే రజనీకాంత్‌కి రికార్డులు కొత్త కాదు. తమిళనాట ఆయన రికార్డులు బ్రేక్ చేయడం మాములు విషయం కాదు. ‘కబాలి’ మొదలుకుని ‘అన్నాత్తె’ వరకు రజనీ ఫ్లాపులలో నిలిచాడు. సినిమా సినిమాకూ వసూళ్లు పడిపోతూ వచ్చాయి. రజినీ మార్కెట్ కూడా దెబ్బ తింటూ వచ్చింది.
చూస్తుండగానే విజయ్, అజిత్ లాంటి హీరోలు ఆయన్ని దాటేశారు.ఇటీవల వచ్చిన పోన్నియన్ సెల్వన్ కూడా రికార్డులని చేరిపేసింది. రజనీకాంత్ నటించిన ‘2.0’ సినిమా 5.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ ఆ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టేసింది. 20 ఏళ్ల యుఎస్ మార్కెట్లో రజినీ సినిమా కాకుండా వేరే తమిళ చిత్రం నంబర్ వన్ స్థానంలో ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐతే ‘2.0’ ఓవరాల్ వసూళ్ల రికార్డును ‘పొన్నియన్ సెల్వన్’ అధిగమించడం కష్టమే కావచ్చు. ‘పొన్నియన్ సెల్వన్’ ఈ మధ్యే రూ.300 కోట్ల మార్కును దాటింది. అంత టాక్ లేకపోవడం వలన సినిమా నిదానంగా ముందుకు సాగుతుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.