Rajinikanth : రజినీకాంత్ కి అతిపెద్ద వెన్నుపోటు .. ఇంతపెద్ద దెబ్బ కొట్టింది ఎవరు ?

Authored By Sam C | The Telugu News | Published on: October 11, 2022, 9:30 pm

Rajinikanth : సూపర్ స్టార్ ర‌జనీకాంత్..ఈ పేరు అంటే తెలియ‌ని వారుండ‌రు. బ‌స్సు కండ‌క్ట‌ర్‌గా అత‌ని ప్ర‌స్థానం మొద‌లు కాగా, ఇప్పుడు స్టార్ హీరోగా ఇండ‌స్ట్రీని ఏలుతున్నాడు. ర‌జ‌నీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి.మన దేశంలోనే కాదు అనేక దేశాలలోనే ర‌జ‌నీకాంత్‌కి ఫుల్ ఫ్యాన్స ఉన్నారు. ఆయ‌న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే చాలు అన్ని చోట్ల పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ విధంగా అన్ని ప్రాంతాల్లో విశేషమైన ప్రేక్షకాభిమానుల ఆదరణ కలిగి ఉన్నారు. ర‌జ‌నీకాంత్‌కి కొన్నాళ్లుగా స‌క్స‌స్ లేక‌పోగా, పెద్ద‌న్న మూవీ మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం త‌లైవా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ తో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ థీమ్, అలానే పోస్టర్ ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. అనిరుద్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు ర‌జ‌నీకాంత్. అయితే ర‌జ‌నీకాంత్‌కి రికార్డులు కొత్త కాదు. త‌మిళ‌నాట ఆయ‌న రికార్డులు బ్రేక్ చేయ‌డం మాములు విష‌యం కాదు. ‘కబాలి’ మొదలుకుని ‘అన్నాత్తె’ వరకు ర‌జ‌నీ ఫ్లాపుల‌లో నిలిచాడు. సినిమా సినిమాకూ వసూళ్లు పడిపోతూ వచ్చాయి. రజినీ మార్కెట్ కూడా దెబ్బ తింటూ వచ్చింది.

Rajinikanth record breaked by vikram

Rajinikanth record breaked by vikram

Rajinikanth : రికార్డ్ చెరిపేశాడ‌…

చూస్తుండగానే విజయ్, అజిత్ లాంటి హీరోలు ఆయన్ని దాటేశారు.ఇటీవ‌ల వ‌చ్చిన పోన్నియ‌న్ సెల్వ‌న్ కూడా రికార్డుల‌ని చేరిపేసింది. రజ‌నీకాంత్ న‌టించిన ‘2.0’ సినిమా 5.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ ఆ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టేసింది. 20 ఏళ్ల యుఎస్ మార్కెట్లో రజినీ సినిమా కాకుండా వేరే తమిళ చిత్రం నంబర్ వన్ స్థానంలో ఉండడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐతే ‘2.0’ ఓవరాల్ వసూళ్ల రికార్డును ‘పొన్నియన్ సెల్వన్’ అధిగమించడం కష్టమే కావచ్చు. ‘పొన్నియన్ సెల్వన్’ ఈ మధ్యే రూ.300 కోట్ల మార్కును దాటింది. అంత టాక్ లేక‌పోవ‌డం వ‌ల‌న సినిమా నిదానంగా ముందుకు సాగుతుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp