Home » Entertainment » Kalyan Ram To Team Up With Mass Director
Entertainment

Kalyan Ram : మాస్ డైరెక్టర్‌తో జతకట్టనున్న కళ్యాణ్ రామ్.. మూవీ టాక్ రచ్చ రచ్చేనా..?

Authored By
mallesh
The Telugu News | Published on: October 11, 2022, 10:00 pm
Advertisement

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా బింబిసార సినిమా విజయంతో మంచి ఊపు మీదున్నాడు. ఇప్పటివరకు కొత్తగా ఏ సినిమాలకు సైన్ చేయని కళ్యాణ్ రామ్ తాజాగా ఓ మాస్ దర్శకుడితో జతకట్టేందుకు సిద్ధమయ్యాడట.. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ మాస్ డైరెక్టర్ ఎవరా అని నందమూరి ఫ్యాన్స్ తెగ వెతుకుతున్నారట.. ఆయన మరెవరో కాదు సంపత్ నంది అని స్పష్టమైన లీకులు వచ్చాయి. కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు టాలీవుడ్‌లో చాలా తక్కువే ఉన్నాయి.అందులో హిట్స్ కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

అయితే, నందమూరి కుటుంబంలో తన తమ్ముడి జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చిన క్రేజ్ తనకు రాలేదని కళ్యాణ్ రామ్ ఎన్నడూ ఫీల్ అవ్వలేదట.. ఎందుకంటే వారి తండ్రి హరికృష్ణ వారికి నేర్పిన సంస్కారాలే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.కానీ కళ్యాణ్ రామ్ కూడా జనం మెచ్చిన హీరో అవ్వాలని తండ్రి కోరిక అంట.. కళ్యాణ్ రామ్ కెరీర్లో విజయాలు సాధించిన సినిమాలు వేళ్ల మద లెక్కబెట్టవచ్చు. అతనొక్కడే, హరేరామ్, పటాస్, 118, బింబిసార.. ఇందులో బింబిసార కలెక్షన్ల పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. ఈ మూవీని కొత్త దర్శకుడు వమ‌ల్లిడి వ‌శిష్ట్ తెర‌కెక్కించాడు.

Kalyan Ram to team up with Mass director

Advertisement

Kalyan Ram : సైన్స్ ఫిక్షన్ టు మాస్ ఓరియెంటెడ్

దీనికి త్వరలోనే పార్ట్ -2 కూడా తెరకెక్కిస్తానని ముందే చెప్పాడట దర్శకుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తొలి భాగం కంటే రెండో భాగం మరింత ప్రతిష్టాత్మకంగా ఉండాలని వశిష్ట అనుకున్నారట.. అందుకే చాలా రోజులు స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేశాకే షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.. ఈ గ్యాప్ లోనే కళ్యాణ్ రామ్ మాస్ డైరెక్టర్ సంపత్ నందితో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ముందుగా బాలయ్య బాబుతో సినిమా చేయాలని సంపత్ భావించగా అది వర్కౌట్ కాలేదు. తీరా ఆ ప్రాజెక్టుకు కళ్యాణ్ రామ్ ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట.. గతంలో ఈ దర్శకుడు రచ్చ, బెంగాల్ టైగర్ వంటి హిట్స్ కొట్టిన విషయం తెలిసిందే.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి