Categories: EntertainmentNews

Rajkummar Rao : స్టార్ హీరోకు త‌ప్ప‌ని క‌ష్టాలు.. డ‌బ్బుల్లేక చోర్ బ‌జార్‌లో వంద రూపాయ‌ల‌కి కోట్ కొనుక్కున్న న‌టుడు

Advertisement
Advertisement

Rajkummar Rao : హీరోలు అంటే న‌లుగురిని కొట్ట‌డం, తాళ్లు కట్టుకొని జంప్‌లు చేయ‌డం కాదు. న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తూ అండ‌గా నిలిచే వారే నిజ‌మైన హీరోలు. ఇప్పుడు వెండితెర‌పై మ‌న‌ల్ని అల‌రిస్తున్న కొంద‌రు హీరోలు నిజ‌జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. స్వ‌యంకృషితో వారు ఎదిగిన తీరు కొంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తూ ఉంటుంది. ఎదురుదెబ్బల్ని లెక్క చేయకుండా.. అనుకున్నది సాధించేంతవరకు శ్రమిస్తూ ఉండటమే విజయానికి గమ్యస్థానంగా చెప్పాలి. వీటన్నింటికి కాస్తంత లక్ కూడా తోడైతే.. మిగిలిన వారికి భిన్నంగా ఎక్కడికో వెళ్లే పరిస్థితి. అయితే విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్న ఓ హీరో డ‌బ్బుల్లేక వంద రూపాయ‌ల‌కి చోర్ బ‌జార్‌లో కోట్ కొనుక్కున్న విషయం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అత‌ను ఎవ‌రు, ఆ విష‌యాలేంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి.

Advertisement

ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్టార్ హీరోల మాదిరి కండలు తిరిగిన బాడీ లేకున్నా.. మిగిలిన వారిలా అందంగా.. ఆకర్షణీయంగా లేకున్నా.. అరగడుల ఎత్తు లేకున్నా.. పక్కింటి కుర్రాడిలా.. మన మధ్యలో ఉండే వాడి మాదిరి ఉండటమే అతనికి కలిసి వచ్చింది. అతడే.. బాలీవుడ్ హీరోల్లో ఒకరు రాజ్ కుమార్ రావు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇతగాడు..ఇప్పుడు మంచి న‌టుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేనప్పటికి టాలెంట్ ను పెట్టుబడిగా పెట్టుకొని.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఒక‌ప్పుడు అత‌నిది సాదాసీదా జీవితం. తన లైఫ్ లో పడిన కష్టాల గురించి.. అప్పట్లో తాను చేసిన పనుల గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఓ మూవీ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ విష‌యాలు చెప్పుకొచ్చాడు. రాజ్ కుమార్ రావు తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఆ ఏడాది పూర్తైన సందర్భంగా స్కూల్లో ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారని..

Advertisement

Rajkummar Rao Says He Bought A Jacket From Chor Bazaar

అప్పట్లో తమ ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్లమన్నారు. కానీ.. మంచి డ్రెస్ వేసుకోవాలన్న ఆలోచన ఉండేదని.. కానీ చేతిలో డబ్బుల్లేవన్నారు. ఆ పార్టీలో నా స్నేహితులతో కలిసి ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశాం. దీంతో.. అదిరే డ్రెస్ కోసం ఢిల్లీలోని చోర్ బజార్ కు వెళ్లి రూ.100లకు ఒక జాకెట్ కొన్నా. రూ.15లతో ఒక చైన్ కొని మెడలో వేసుకున్నా. స్టేజ్ మీద డ్యాన్స్ చేశా’ అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. విజేతలు ఎప్పుడూ ఉత్తగా రారు. దానికి కొండంత కష్టం చేసిన తర్వాతే వారు విజేతలుగా మారతారన్న విషయం రాజ్ కుమార్ రావు జీవితంలోని ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది. రాజ్ కుమార్ రావుకి ఇప్పుడు ఎలాంటి డ్రెస్ కావాలన్నా నిమిషాల్లో అతని ముందు వచ్చి వాలుతుంది. కానీ.. కొన్నేళ్ల క్రితం చక్కటి కోట్ వేసుకోవటానికి అవసరమైన డబ్బుల్లేక తాను చేసిన పనిని చెప్పుకొచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు రాజ్ కుమార్ రావు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల రాజ్‌ కుమార్ రావు తన పాన్ కార్డును ఎవరో తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసినట్టు ట్విటర్‌లో వెల్లడించారు.

అంతేకాక తన పేరుపై రూ.2,500 లోన్ కూడా తీసుకున్నట్టు పేర్కొన్నారు. తన ప్రమేయం లేకుండా తీసుకున్న ఈ లోన్ వల్ల తన సిబిల్ స్కోర్ ప్రభావితమైందని చెప్పారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్ కుమార్ రావు.. అంధత్వాన్ని సమస్యగా భావించకుండా సవాల్‌గా భావించి సరికొత్త విజయగాథను రాసుకున్న తెలుగు పారిశ్రామికవేత్త పాత్రలో నటించబోతున్నారు. శ్రీకాంత్ బొల్లా.. అంధత్వం తన కలలను చిదిమేయకుండా బోలెంట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ స్థాపించి దానిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన బయోపిక్ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి రాజ్‌కుమార్ రావు మాట్లాడుతూ, “శ్రీకాంత్ బొల్లా ఒక స్ఫూర్తి.. శ్రీకాంత్ లాంటి ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీగా నటించడం నిజంగా నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా. ఫీనిక్స్ లాగా ఎదగండి అని శ్రీకాంత్ జీవితం చెబుతోంది , శ్రీకాంత్ పాత్రలో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను, అని ఇటీవ‌ల ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

Recent Posts

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

23 mins ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

1 hour ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

2 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

4 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

5 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

6 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

7 hours ago

This website uses cookies.