
Rakul Preet Singh mind blowing looks viral
Rakul Preet Singh : అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలి కాలంలో వరుస ఫొటో షూట్స్ చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. ఈ అమ్మడి రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. తాజాగా, రకుల్ పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ట్రేండీ అవుట్ ఫిట్ లో మతిపోగొడుతోంది. గ్రీన్ కలర్ హాఫ్ షోల్డర్ టాప్ లో అట్రాక్ట్ చేస్తోంది. వైట్ కలర్ కార్గో జీన్స్ ధరించి తనలోని రౌడీ బేబీని పరిచయం చేస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలతో అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ రకుల్ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘నేను మరియు భూమి స్నేహితులం.. మరీ మీరూ?’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
గ్రీన్ కలర్ టాప్ ను ధరించడంతో నెటిజన్లు కామెంట్లు, లైక్ లతో పొడుగుతున్నారు… గ్లామరస్, బ్యూటీఫుల్, స్టన్నింగ్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడితో తెగ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానితో ఇటీవల తాజ్‌మహల్‌కి కూడా వెళ్లింది. అతనితో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఇటీవల తన పెళ్లిపై కూడా స్పందించింది. ‘‘ప్రస్తుతం నా ఏకాగ్రత అంతా పనిపైనే ఉంది. నా ప్రేమ విశేషాలను సరైన సమయంలో చెబుతాను. దేనికైనా టైమ్ రావాలి’’ అంటూ ఓ చాలెంజింగ్ రోల్ వస్తే వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమే అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
rakul preet singh shares intresting pics
కొంతకాలం జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిన రకుల్ ఇటీవల తన రిలేషన్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలోని చిత్ర దర్శకుడు లవ్ రంజన్ వివాహం వేడుకల్లో తన ప్రియుడు జాకీ భగ్నానీ తో కలిసి హాజరైంది. రకుల్.. అజయ్ దేవగన్ తో కలిసి నటించిన `దేదే ప్యార్ దే` చిత్రానికి రంజన్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే రకుల్ ఇటీవల కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టింది. సినిమా పరిశ్రమ గురించీ ఆలోచించారు. కొత్త టాలెంట్‌కు, పరిశ్రమ వర్గాలకూ మధ్య వారధిగా ఓ యాప్ రూపొందించారు
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.