Ram charan : సీఎంగా రామ్ చరణ్ ప్రమాణ స్వీకారం చేస్తారా.. ?

Authored By vamana sai | The Telugu News | Published on: March 29, 2021, 12:40 pm

Ram charan : సీఎంగా క్యారెక్టర్ అంటే మన టాలీవుడ్ స్టార్స్ హీరోలకి ఎంత ఆసక్తి ఉంటుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే అంత ఈజీ కాదు. కమర్షియల్ హీరోకి పెద్దగా లిమిటేషన్స్ ఉండవు. ఎలాంటి పాత్రల్లో అయినా నటించడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినప్పుడే ఎన్నో విషయాలని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సిల్వర్ స్క్రీన్ మీద హీరోని సీఎం పాత్రలో చూపించే దర్శకుడిలో సత్తా ఉంటే మాత్రం గ్యారెంటీగా బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. గతంలో మెగాస్టార్ చిరంజీవి ముఠా మేస్త్రీ సినిమాలో సీఎం గా నటించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో చిన్న రోల్ చేశాడు.

అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ పూర్తి స్థాయిలో సీఎం గా కనిపించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాం చరణ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. భారీ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరొక హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది.

shankars movie ram charan As CM Role

shankars movie ram charan As CM Role

Ram charan : శంకర్ సినిమాలో ముఖ్యమంత్రిగా చరణ్ ..?

అలాగే మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆచార్య సినిమాలో కామ్రేడ్ సిద్దగా కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్ చెన్నై లో జరుగుతోంది. అయితే శంకర్ ఈ సినిమాలో చరణ్ ని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నట్టు న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp