Ram Charan : ఆ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ రామ్ చ‌ర‌ణ్ అన్న‌.. త్వ‌ర‌లోనే పెళ్లి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : ఆ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ రామ్ చ‌ర‌ణ్ అన్న‌.. త్వ‌ర‌లోనే పెళ్లి..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 March 2022,4:30 pm

Ram Charan : ఆది పినిశెట్టి.. ఈ న‌టుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌ర‌చితం. కోలీవుడ్‌లో మంచి హ‌వా న‌డుస్తున్న స‌మ‌యంలోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగస్థలంలో కుమార్ బాబు అనే పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఆది.. ఆ తర్వాత ‘నీవెవరో’, ‘యూటర్న్’ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. నిక్కీ గ‌ల్రానీతో ప్రేమ‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ సరసన కృష్ణాష్టమి, ఆది పినిశెట్టి సరసన మలుపు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో నిక్కీ గల్రాని పెద్దగా పాపులర్ కాలేదు. నిక్కీ గల్రాని ఇండస్ట్రీలోకి సంజన గల్రాని సోదరిగా ఎంట్రీ ఇచ్చింది.

మలుపు చిత్రంతో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అంటున్నారు. ఆది పినిశెట్టి సన్నిహితులు ఈ విషయాన్ని మీడియాకు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆది, నిక్కీ గల్రాని ఇద్దరూ తమ రిలేషన్ జీవితాంతం కొనసాగించబోతున్నారు అని.. దీని కోసం వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నిక్కీ గల్రాని.. ఆది పినిశెట్టి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా హాజరవుతోందట.

ram charan brother marriage in soon

ram charan brother marriage in soon

Ram Charan : ప్రేమ ముచ్చ‌ట్లు..

నిక్కీ గల్రాని ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటన కొనసాగిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. వీరి ప్రేమ‌, పెళ్లి వివాహంపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆది ..రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక నిక్కీ గల్రాని విషయానికి వస్తే ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.ఆది విష‌యానికి వ‌స్తే..ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో కమర్షియల్ హీరోగా రాణిస్తూనే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది