Game Changer : ఏంటి రాజు గారు గేమ్ చేంజర్ మీద అంత బడ్జెట్ పెట్టారా.. అందుకేనా ఈ టెన్షన్ అంతా..?
ప్రధానాంశాలు:
Game Changer : ఏంటి రాజు గారు గేమ్ చేంజర్ మీద అంత బడ్జెట్ పెట్టారా.. అందుకేనా ఈ టెన్షన్ అంతా..?
Game Changer : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju రెండు దశాబ్దాల అనుభవంలో Game Changer మొదటి సారి ఒక భారీ బడ్జెట్ సినిమా చేశాడు. అంటే అంతకుముందు భారీ బడ్జెట్ సినిమాలు చేయలేదని కాదు కానీ ఆయన కెరీర్ లో ఈ రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ సినిమా చేయలేదు. దిల్ రాజు ఇప్పటివరకు 200 కోట్లు పైన బడ్జెట్ తో ఏ సినిమా చేయలేదు.. కానీ శంకర్ కోసం ఈసారి ఏకంగా 450 కోట్ల సినిమా తీశాడు.,,
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan తో శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. శంకర్ మార్క్ గ్రాండియర్ తో వస్తున్న ఈ సినిమా లో సాంగ్స్ కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టారంటే మాత్రం.. ఆ లెక్క ఎలా ఉంటుందో తెలిసిందే.
Game Changer ఓల్డ్ లుక్ లో రామ్ చరణ్..
రామ్ చరణ్ మాస్ స్టామినా ఏంటో మళ్ళీ తెలిసేలా గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు. ట్రైలర్ లో ఓల్డ్ లుక్ లో రామ్ చరణ్ అదరగొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు. అయితే సినిమా రిలీజ్ టైమ్ లో నిర్మాత దిల్ రాజు ఇంకా కంగారు లోనే ఉన్నాడు. ఎందుకంటే సంక్రాంతి సినిమాలకు ఏపీలో బెనిఫిట్ షోస్.. టికెట్ రేట్లు కూడా పెంచారు. కానీ తెలంగాణా లో మాత్రం ఇంకా పెంచలేదు.
పెంచుతారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తెలంగాణా CM రేవంత్ రెడ్డి Revanth Reddy తాను CM గా ఉన్నంతవరకు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వనని చెప్పారు. కానీ FDC చైర్మన్ గా దిల్ రాజు ఇంకా సీఎం తో చర్చలు జరుపుతామని అంటున్నారు. దిల్ రాజు అందుకే కాస్త టెన్షన్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మరి రిలీజ్ టైమ్ కల్లా ఇష్యూ సాల్వ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. Ram Charan, Game Changer, Game Changer Budget, Dil Raju