Ram Charan : డ్రైవర్‌కు అంత వేతనమా.. రామ్ చరణ్ రేంజ్ అది..!
Ram Charan : సాధారణంగా డ్రైవర్‌కు నెలకు రూ.15 వేలో లేదా రూ.18 వేలో లేదా రూ.20 వరకు వేతనం ఇస్తుండటం మనం చూడొచ్చు. అయితే, సెలబ్రిటీలు కొంచెం ఎక్కువ అనగా రూ.25 లేదా రూ.30 వేల వరకు వేతనంగా ఇస్తుంటారు. కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాత్రమ తన డ్రైవర్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇచ్చిన మాదిరిగా శాలరీ ఇస్తారట. తన స్టాఫ్‌ను చెర్రీ ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాడని, సొంత వాళ్లలా ట్రీట్ చేస్తాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది.టాలీవుడ్ టాప్ ఫైవర్ హీరోల్లో ఒకరిగా చరణ్ ఉన్నాడు. ప్రజెంట్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’లో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రను పోషిస్తున్నాడు.
ఈ సంగతి పక్కనబెడితే.. రామ్ చరణ్ తన డ్రైవర్‌కు ఇచ్చే శాలరీ విషయమై వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రామ్ చరణ్ తన దగ్గర పని చేసే స్టాఫ్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడట. కరోనా నేపథ్యంలో వారికి ఏమైనా తానే ఖర్చు భరించాడట. ఈ క్రమంలోనే తన డ్రైవర్‌కు వేతనం నెలకు రూ.45 వేలు ఇస్తున్నాడనే వార్త ప్రజెంట్ ప్రచారంలో ఉంది. ఈ విషయం తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు సమానమైన వేతనం డ్రవైర్‌కు ఇస్తున్న రామ్ చరణ్ అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ రేంజ్ అది అని కాలర్ ఎగరేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చెర్రీ.. జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నాడు.
Ram Charan : చెర్రీ.. ప్రజెంట్ ఫుల్ బిజీ..
ఇందులో చరణ్ సరసన బ్యూటిఫుల్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత నేషనల్ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ. ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడు.