
Ram charan has never severed that bond with JR NTR
Ram charan : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు మిగతా హీరోలకు మధ్య మంచి సన్నిహిత్యం ఉంటుంది. నేను పెద్దా, నువ్వు చిన్న అని భేదాభిప్రాయాలు ఎక్కడా కనిపించవు. పోటీ అనేది సినిమాల పరంగా, కలెక్షన్స్ పరంగా మాత్రమే ఉంటుందట.. అలా ఉంటేనే ఇండస్ట్రీలో తాము మంచి పొజిషన్‌లో ఉండటమే కాకుండా చిత్ర పరిశ్రమ కూడా పచ్చగా ఉంటుందని కొందరు సెలబ్రిటీలు చెబుతున్నారు. ఇక ఖాళీ టైం దొరికితే చాలు వీరంతా ఒక చోట చేరి మామ, బావ, తమ్ముడు, అన్నయ్య అని సరదాగా పిలుచుకుంటారని తెలిసిందే. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరో రాంచరణ్, రానా, ప్రభాస్, నాని, ఎన్టీఆర్ వీరంతా చాలా సరదాగా ఉంటారు. అసలు తారతమ్యాలు చూపించుకోరు. అందుకే ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందని టాక్..
Ram charan has never severed that bond with JR NTR
ఆర్ఆర్ఆర్ సినిమాతో అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ మధ్య ఉన్న బంధం మరోసారి బలపడింది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ రెండు ఫ్యామిలీలకు అస్సలు పడదని, ఫ్యాన్స్ కూడా మా హీరోలే గ్రేట్ అంటే.. మా వాళ్లే గ్రేట్ అనుకుంటూ గొడవలకు పోతారని రూమర్స్ వినిపిస్తుంటాయి. మొన్న జరిగిన మా ఎన్నికల్లో కూడా మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజ్‌కు సపోర్టు ఇస్తే.. నందమూరి ఫ్యామిలీ మంచు విష్ణు ప్యానెల్‌కు సపోర్టు ఇచ్చిందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వాస్తవానికి మా కుటుంబం అంతా ఒక్కటే చిరంజీవి, బాలయ్య బాబు ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. అదే స్నేహం ప్రజెంట్ జనరేషన్ కూడా కొనసాగిస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రాంచరణ్ కొంత ఎమోషనల్ అయ్యారట.. ఇండస్ట్రీలో తొలి హిట్ ఇచ్చి నా కెరీర్ బాటలు వేసిన దర్శకుడు రాజమౌళికి స్పెషల్ థాంక్స్ చెప్పిన చెర్రీ.. తర్వాత తారక్‌తో తన బంధం గురించి ఓపెన్ అయ్యాడు. తారక్ తనకు బ్రదర్ లాంటి వాడని, వయస్సులో పెద్దైనా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందని చెప్పాడు. తనకు ఇంత మంచి బ్రదర్‌ను ఇచ్చి.. ఆర్ఆర్ఆర్‌లో అవకాశం కల్పించినందుకు నిర్మాత దానయ్యకు, లైకా ప్రొడక్షన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాడు. చనిపోయే వరకు తారక్‌తో తన బంధాన్నివీడనని చెప్పుకొచ్చాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.