Ram Charan : రామ్ చరణ్ మంచి మనసు.. దిల్ రాజు కోసం అందుకు సిద్ధమయ్యాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : రామ్ చరణ్ మంచి మనసు.. దిల్ రాజు కోసం అందుకు సిద్ధమయ్యాడా..?

 Authored By ramesh | The Telugu News | Updated on :19 January 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Ram Charan : రామ్ చరణ్ మంచి మనసు.. దిల్ రాజు కోసం అందుకు సిద్ధమయ్యాడా..?

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ మూవీ గేం ఛేంజర్ Game Changer దగ్గర బోల్తా కొట్టింది. సినిమాను శంకర్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. శంకర్ సినిమాలో ఉండాల్సిన అంశాలు ఉన్నా కూడా రొటీన్ కథ కథనం అంటూ విపరీతమైన ట్రోల్స్ వల్ల సినిమా బలైంది. ఐతే ఈ సినిమాపై వచ్చిన ట్రోల్స్ గురించి థమన్ స్పందించడం దానికి చిరంజీవి రెస్పాండ్ అవ్వడం తెలిసిందే. ఇదిలాఉంటే గేమ్ ఛేంజర్ వల్ల నిర్మాత దిల్ రాజు Dil Raju భారీ నష్టాలు చవిచూసేలా ఉన్నాడు. సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చిన దిల్ రాజు Dil Raju గేమ్ ఛేంజర్ తో ఫ్లాప్ అందుకోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా sankranthiki vasthunam కాస్త ఒడ్డున పడేసింది. ఐతే దిల్ రాజు కి రామ్ చరణ్ ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తన సినిమా వల్ల నష్టపోయిన దిల్ రాజుకి అతను హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Ram Charan రామ్ చరణ్ మంచి మనసు దిల్ రాజు కోసం అందుకు సిద్ధమయ్యాడా

Ram Charan : రామ్ చరణ్ మంచి మనసు.. దిల్ రాజు కోసం అందుకు సిద్ధమయ్యాడా..?

Ram Charan : సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా..

దిల్ రాజుతో మరో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడట. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు Buchibabu తో ఒక సినిమా చేస్తుండగా నెక్స్ట్ సినిమా సుకుమార్ తో ప్లాన్ చేస్తున్నాడు. RC16, 17 సినిమాలు రెండు ఉన్నాయి. ఆ తర్వాత దిల్ రాజుతో సినిమా చేసేలా మాట ఇచ్చాడట. అంతేకాదు ఆ సినిమాకు రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేస్తానని అన్నాడట. అంతేకాదు సినిమా రిలీజై లాభాలు వస్తే అప్పుడు ఏమన్నా లాభాల్లో వాట ఇవ్వమని అన్నాడట.

చరణ్ మంచి మనసుకి దిల్ రాజు సంతోషపడ్డాడట. రామ్చరణ్ రెండు సినిమాల తర్వాత దిల్ రాజు ఒక క్రేజీ కాంబినేషన్ లో చరన్ తో సినిమా ఫిక్స్ చేసుకుంటాడని తెలుస్తుంది. ఐతే ఆ సినిమా డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ దిల్ రాజు ఈసారి మాత్రం టార్గెట్ అసలు మిస్ అవ్వకుండా అదరగొట్టేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి ఆ కాంబో ఏది అవుతుందో చూడాలి. Ram Charan, Dil Raju, Game Changer, Shankar, Global Star Ram Charan

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది