Ram Charan : కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతున్న రామ్ చరణ్.. ఉప్పెన బుచ్చిబాబు డైరెక్టర్.. కథ అదిరిపోయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram Charan : కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతున్న రామ్ చరణ్.. ఉప్పెన బుచ్చిబాబు డైరెక్టర్.. కథ అదిరిపోయింది..!

Ram Charan : రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తోంది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనేదానిపై చాలా రోజుల నుంచి ఆయన అభిమానులకు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అయితే.. ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్టు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 July 2023,7:00 pm

Ram Charan : రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తోంది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనేదానిపై చాలా రోజుల నుంచి ఆయన అభిమానులకు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

అయితే.. ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో తీయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవల్ లో రానుందట. ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆ సినిమా స్టోరీ ఏంటో కూడా అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.ఈ సినిమాలో రామ్ చరణ్.. కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తారట. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రామ్ చరణ్ కు 16వ సినిమా అవబోతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.

ram charan new movie directed by uppena buchi babu

ram charan new movie directed by uppena buchi babu

Ram Charan : సినిమా కథ అదేనా?

రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతోంది. తమిళ్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తారట. ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగితా వివరాలు మాత్రం తెలియలేదు. హీరోయిన్ ఎవరో కూడా క్లారిటీ లేదు కానీ.. ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం థియేటర్లలో అరుపులే అంటూ రామ్ చరణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది