
ram charan new movie directed by uppena buchi babu
Ram Charan : రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తోంది. ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనేదానిపై చాలా రోజుల నుంచి ఆయన అభిమానులకు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
అయితే.. ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో తీయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవల్ లో రానుందట. ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆ సినిమా స్టోరీ ఏంటో కూడా అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.ఈ సినిమాలో రామ్ చరణ్.. కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తారట. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రామ్ చరణ్ కు 16వ సినిమా అవబోతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.
ram charan new movie directed by uppena buchi babu
రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతోంది. తమిళ్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తారట. ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగితా వివరాలు మాత్రం తెలియలేదు. హీరోయిన్ ఎవరో కూడా క్లారిటీ లేదు కానీ.. ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం థియేటర్లలో అరుపులే అంటూ రామ్ చరణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.