
Ram Charan on trip to Spain with wife
Ram Charan : కరోనా వలన చాలా మంది సెలబ్రిటీలు కొన్నాళ్లుగా ఇంటికే పరిమితం అయ్యారు.ఇటీవల కరోనా కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే విదేశాలకు వెళుతున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి వంటి వారు ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ టైం వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒకటై దశాబ్దం గడుస్తోంది. వీరిద్దరూ పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇన్నేళ్ల వీరి వైవాహిక జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. అనుక్షణం ఆప్యాయతానురాగాలను పంచుకుంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవీతాన్ని వీరు అనుభవిస్తున్నారు. అద్భుతమైన ఘడియలను సంతోషంగా పంచుకోవడానికి ఇద్దరూ ఇటలీకి బయల్దేరారు.
ఇటలీకి వీరు బయల్దేరుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జూన్ 14, 2012లో జరిగిన సంగతి తెలిసింది. వారి వివాహా బంధానికి పదేళ్లు నిండటంతో ఇలా స్పెషల్‌గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్, ఉపాసనలు ఎయిర్ పోర్ట్ వద్ద కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఓ వారం పాటు రామ్ చరణ్, ఉపాసనలు ఫ్లోరెన్స్‌లోనే ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్ మాత్రం ఇలా చాలా రోజుల తరువాత ఫ్యామిలీ వెకేషన్ వేశాడు. ఆ మధ్య అయితే షూటింగ్‌ల కోసం రామ్ చరణ్ వెళ్తే.. అతనితో పాటుగా ఉపాసన వెళ్లేది. ఇక ఇప్పుడు ఇలా స్పెషల్ ట్రిప్ వేసేశారు.
Ram Charan on trip to Spain with wife
టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ భార్యగా.. మెగాస్టార్ కోడలుగా.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఫ్యామిలీకి, అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి మంచి పేరే ఉంది. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయింది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరితో సినిమా కన్ఫామ్ అయింది. అయితే ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి వారితోనూ సినిమాలు చేయబోతోన్నట్టు టాక్ వచ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.