Categories: EntertainmentNews

Ram Charan Peddi : రామ్ చరణ్  ‘పెద్ది’ ఇదేకదా మీము కోరుకుంటున్నది..!

Ram Charan Peddi : రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ మాములుగా లేదు. గేమ్ ఛేంజర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. ఇప్పుడు అభిమానులంతా RC 16 పైనే ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా కోసం అందిస్తున్న అప్‌డేట్‌లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముందుగా టీజర్ ను ఈరోజే విడుదల చేయాలని భావించినప్పటికీ, ఫైనల్ మిక్సింగ్, రీ-రికార్డింగ్ ఆలస్యమైన కారణంగా ఉగాది రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ గ్యాప్ లో ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా టైటిల్ రివీల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు సంతోషం అందించారు.

Ram Charan Peddi : రామ్ చరణ్  ‘పెద్ది’ ఇదేకదా మీము కోరుకుంటున్నది..!

Ram Charan Peddi రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది ‘

ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ నిఖార్సైన మాస్ లుక్ తో కనిపించారు. చేతిలో చుట్ట కాలుస్తూ, రౌద్రం నిండిన కళ్లతో కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రంగస్థలం తరహాలో గ్రామీణ నేపథ్యంలో సినిమా నడవనున్నట్లు అర్థమవుతోంది. మరో స్టిల్ లో రఫ్ లుక్ లో జీన్స్ ధరించి, క్రికెట్ బ్యాట్ పట్టుకుని కనిపించడం ఈ సినిమా కథలో స్పోర్ట్స్ ఎలిమెంట్ ఉందని హింట్ ఇచ్చింది. గతంలో గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా సాఫ్ట్ లుక్ లో కనిపించిన చరణ్, ఆ సినిమా బలహీనమైన కథ కారణంగా నిరాశ పరచగా, పెద్ది విషయంలో అలాంటి అనుమానాలు లేవని అంతా నమ్ముతున్నారు.

ఇప్పటికి పెద్ది రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే టీజర్ లో రిలీజ్ డేట్ ఉండొచ్చని సమాచారం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, దివ్యేంద్రు లాంటి నటీనటులు, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. మొత్తానికి బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తన పెద్ది లుక్ తో అభిమానులను ఉర్రూతలూగించి, సినిమా పై అంచనాలను పెంచాడు.

Recent Posts

Kasivinda Plant | సీజ‌న‌ల్ ఈ వ్యాధుల‌కి చెక్ పెట్ట‌నున్న చెన్నంగి.. ఇది ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం

Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…

51 minutes ago

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

2 hours ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

3 hours ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

12 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

13 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

14 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

15 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

16 hours ago