Ram Charan Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ ఇదేకదా మీము కోరుకుంటున్నది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan Peddi : రామ్ చరణ్  ‘పెద్ది’ ఇదేకదా మీము కోరుకుంటున్నది..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Ram Charan Peddi : రామ్ చరణ్  'పెద్ది' ఇదేకదా మీము కోరుకుంటున్నది..!

Ram Charan Peddi : రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ మాములుగా లేదు. గేమ్ ఛేంజర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. ఇప్పుడు అభిమానులంతా RC 16 పైనే ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమా కోసం అందిస్తున్న అప్‌డేట్‌లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముందుగా టీజర్ ను ఈరోజే విడుదల చేయాలని భావించినప్పటికీ, ఫైనల్ మిక్సింగ్, రీ-రికార్డింగ్ ఆలస్యమైన కారణంగా ఉగాది రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ గ్యాప్ లో ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా టైటిల్ రివీల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు సంతోషం అందించారు.

Ram Charan Peddi రామ్ చరణ్ 'పెద్ది' ఇదేకదా మీము కోరుకుంటున్నది..!

Ram Charan Peddi : రామ్ చరణ్  ‘పెద్ది’ ఇదేకదా మీము కోరుకుంటున్నది..!

Ram Charan Peddi రామ్ చరణ్ – బుచ్చిబాబు ‘పెద్ది ‘

ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ నిఖార్సైన మాస్ లుక్ తో కనిపించారు. చేతిలో చుట్ట కాలుస్తూ, రౌద్రం నిండిన కళ్లతో కనిపించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. రంగస్థలం తరహాలో గ్రామీణ నేపథ్యంలో సినిమా నడవనున్నట్లు అర్థమవుతోంది. మరో స్టిల్ లో రఫ్ లుక్ లో జీన్స్ ధరించి, క్రికెట్ బ్యాట్ పట్టుకుని కనిపించడం ఈ సినిమా కథలో స్పోర్ట్స్ ఎలిమెంట్ ఉందని హింట్ ఇచ్చింది. గతంలో గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా సాఫ్ట్ లుక్ లో కనిపించిన చరణ్, ఆ సినిమా బలహీనమైన కథ కారణంగా నిరాశ పరచగా, పెద్ది విషయంలో అలాంటి అనుమానాలు లేవని అంతా నమ్ముతున్నారు.

ఇప్పటికి పెద్ది రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే టీజర్ లో రిలీజ్ డేట్ ఉండొచ్చని సమాచారం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, దివ్యేంద్రు లాంటి నటీనటులు, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. మొత్తానికి బర్త్ డే బాయ్ రామ్ చరణ్ తన పెద్ది లుక్ తో అభిమానులను ఉర్రూతలూగించి, సినిమా పై అంచనాలను పెంచాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది