Ram charan : ‘ఆర్.ఆర్.ఆర్’ పాన్ ఇండియన్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంతకు ముందు జూనియర్ ఎన్.టి.ఆర్ పుట్టినరోజు సందర్బంగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఇప్పుడు రాం చరణ్ బర్త్ డే సందర్బంగా భారీ సర్ప్రైజ్ ఒకటి చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గా నటిస్తుండగా. రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా రాం చరణ్ కి గిఫ్ట్ గా ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ లుక్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఎలా ఉండబోతున్నాడో తెలియబోతుంది.
అది ఆకాశంలోకి విల్లు ఎక్కుపెట్టి రౌద్రాన్ని చూపిస్తున్న ఆ గెటప్ చాలా ఆప్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. భగ భగ మండే అగ్నిలో బాణం సందిస్తూ కనిపించేలా ఉన్న ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాలోని పాత్రకు రామ్ చరణ్ పూర్తిగా న్యాయం చేశాడని అనిపిస్తుంది. పోస్టర్లో ఉన్న లుక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిస్తునందున షూటింగ్ కంప్లీట్ అయ్యేందుకు ఇంక కొంచెం సమయం పట్టవచ్చు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్.. రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ – నేషనల్ అవార్డ్ గ్రహీత సముద్రఖని – శ్రీయా శరణ్ – హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్ – అలిసన్ డూడీ తదితరులు ఇతర ప్రధాన ప్రాతలు పోషిస్తున్నారు.
కీరవాణి సంగీతం సమకూర్చగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఆర్.ఆర్.ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా హైప్ క్రియేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఐదు భాషలలో థియేట్రికల్ రిలీజ్ చేయడానికి 350 కోట్ల డీల్ పూర్తి చేశారట. తాజాగా మరో 6భాషల రిలీజ్ కూడా ప్లాన్ చేస్తునట్లు తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు.. ఆర్.ఆర్.ఆర్ డిజిటల్- శాటిలైట్ డీల్ కూడా చేస్తునట్లు సమాచారం. ఇప్పటికే స్టార్ మా-అమెజాన్ ప్రైమ్ వాళ్లు రూ .291 కోట్లు (శాటిలైట్ రూ .130 కోట్లు… డిజిటల్ రూ .160కోట్లు కలుపుకుని) ఆఫర్స్ వస్తున్నాయట. అయితే మేకర్స్ ఇంకా ఆలోచిస్తూ అడుగులేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.