ram charan supports to his sister
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పర్సనల్ లైఫ్ చాలా డిస్ట్రబ్‌గా మారింది. మొదట 2007 సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో 2014లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2016 సంవత్సరంలో కళ్యాణ్ దేవ్‌ని పెళ్లాడింది. వీరికి నవిష్క ఓ పాప కూడా పుట్టింది. కళ్యాణ్‌తో సంతోషంగా ఉంటుందని అనుకోగా,అతనికి విడాకులు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇటీవల శ్రీజ తన సోషల్ మీడియాలో శ్రీజ కళ్యాణ్ దేవ్ పేరుని శ్రీజ కొణిదెలగా మార్చడంతో అనుమానాలు మరింత రెట్టింపు అయ్యాయి.అయితే శ్రీజ మరోసారి విడాకులు పట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడు రీసెంట్‌గా ముంబై ఎయిర్ పోర్ట్‌లో చరణ్‌తో పాటు మెరిసింది.
విడాకుల విషయంతో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్‌కి వెళ్లిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రామ్ చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే తనతో పాటే షూటింగ్ లొకేషన్స్ తిప్పుతూ ఆమె మనసు ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్… విజేత సినిమాతో హీరోగా పరిచయం కాగా, ఆయన నటించిన ‘సూపర్ మచ్చి చిత్రం రీసెంట్‌గా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్‌గా జరిగిన మెగా ఫ్యామిలీ మీట్స్‌కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ram charan supports to his sister
ఓ పక్క ఇదంతా నడుస్తున్నా మెగా ఫ్యామిలీ మౌనం వహించడం కూడా జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది. ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ తాజాగా తన ఇన్‌స్టాలో నువ్ అది చేయలేవ్.. ఇది చేయలేవ్ అని జనాలు చెబుతుంటారు.. అలాంటప్పుడు వారిని చూసి నవ్వుకుని ఇలా చెప్పండి.. నేను చేస్తాను చూడండి అని చెప్పండంటూ పోస్ట్ చేశాడు. తన తదుపరి చిత్రం కోసం రూపు రేఖలు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి కళ్యాణ్ దేవ్ పోస్ట్ కింద.. విడాకుల మ్యాటర్ గురించే కామెంట్లు కనిపిస్తున్నాయి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.