Ram Gopal Varma : పబ్‌లో అమ్మాయిలతో ఆ ముద్దులు, డ్యాన్స్‌లు ఏంది రామ్ గోపాల్ వర్మ..!
RGV : రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసిన అది సంచలనమే అవుతుంది. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటాడు. ఈయన చేసే రచ్చ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతుంటారు. సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు పలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు. అవి చూసి అందరు నోరెళ్లపెడుతుంటారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో కొన్ని వీడియోలు షేర్ చేయగా, అందులో పబ్‌లో అమ్మాయిలతో ఉన్న వీడియోలు కాగా, కొన్ని అమ్మాయిలతో కలిసి సిగరెట్ తాగుతూ చిందులేస్తున్నాడు. మరో వీడియోలో ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకుని మరో చేతితో అమ్మాయిని గట్టిగా హత్తుకున్నాడు.
వర్మ తన ట్విట్టర్ లో మరో ఫొటోను షేర్ చేస్తూ దానికి క్యాప్షన్ చెబితే లక్షరూపాయలు ఇస్తానని పేర్కొన్నాడు. తర్వాత ఏమనుకున్నారో దాన్ని ట్విట్టర్ నుంచి తొలిగించారు. అది ప్రక్కన పెడితే ఇక్కడ ఇచ్చిన వీడియోలు కూడా ఆయన అభిమానులు చాలా మందికి నచ్చటం లేదు. వర్మ షేర్ చేసిన ఈ వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో రచ్చ చేస్తున్నాయి.ఇక వర్మ ప్రస్తుతం కొండా అనే చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా కొండా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఆర్జీవీ . ఈ ట్రైలర్ తో మరోసారి తన గొంతును సవరించారు.

Ram Gopal Varma full enjoyment in pub
Ram Gopal Varma : బాబోయ్.. వర్మ ఎందుకింత ధైర్యం..!
సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు బాగుచేయాలి అంటూ వర్మ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. నీకు పోయేటందుకు ఏమీ లేవు బానిస సంకెళ్లు తప్ప.. విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైలింజన్.. పేతందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి.. వాటిపై పోరాడటానికి .. ఇలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టిన వాడే కొండా మురళి అంటూ ట్రైలర్ లో వర్మ వివరించారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచిందనే చెప్పాలి.
Me cigaretting and grooving with the super lovely @inaya_sultana at #GreaseMonkey pic.twitter.com/EdesClOpkv
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2022