Ram Gopal Varma : అల్లు అర్జున్ న్యూ మెగాస్టార్ అంటూ చిరంజీవి- రామ్ చరణ్ చెప్పారంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : అల్లు అర్జున్ న్యూ మెగాస్టార్ అంటూ చిరంజీవి- రామ్ చరణ్ చెప్పారంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్

 Authored By sandeep | The Telugu News | Updated on :17 April 2022,5:30 pm

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క్రియేట్ చేసే సెన్సేష‌న్స్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. వ‌ర్మకి మెగా ఫ్యామిలీ అంటే ఆస‌క్తి చాలా ఉంటుంది. ఈ మధ్య అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఉన్నట్టుండి బన్నీని ఆకాశానికి ఎత్తేశాడు. పుష్ప సినిమాను ప్రస్తావిస్తూ.. ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్ళావంటూ తెగ పొగిడేశాడు. వర్మ ట్వీట్ చేస్తూ.. హే అల్లు అర్జున్ .. అంతిమ్,సత్యమేవ జయతే 2, 83 లాంటి సినిమాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటిని వెనక్కి నెట్టి.. తెలుగు సినిమాను.. ఒక రీజనల్ సినిమా పుష్ప ను జాతీయ స్థాయిలో నిలబెట్టావ్..

ఈ క్రెడిట్ అంతా నీదే కుదోస్ అంటూ.. బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ.ఇక తాజాగా ఆచార్య సినిమా విష‌యంలో మ‌రోసారి అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తాడు. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య సినిమాలోని ‘భలే భలే బంజారా’ సాంగ్‌ విడుదల తేదిని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన స్పెషల్‌ వీడియో చూసి నిర్మొహమాటంగా తన మనసులో మాట బయటపెట్టారు వర్మ. మరోసారి అల్లు అర్జున్ టాపిక్ తీస్తూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆచార్య నుంచి విడుదల చేసిన ఆ వీడియోలో ‘నువ్వు నన్ను డామినేట్ చేస్తావా

Ram Gopal Varma praises on allu arjun

Ram Gopal Varma praises on allu arjun

‘ అంటూ చిరంజీవి- రామ్ చరణ్ మధ్య నడిచిన సంభాషణ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.దీంతో ఇదే వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. ”తగ్గను తగ్గను.. అంటూ అల్లు అర్జున్ తగ్గదేలే డైలాగ్స్‌తో మెగా ఫాదర్, మెగా సన్ అనుకుంటూ ఉండటం చూసి నేను మెగా హర్ట్ అయ్యాను. ఇక్కడ బన్నీ డైలాగులు వాడటం చూస్తుంటే న్యూ మెగా హీరో అల్లు
అర్జునే అని రామ్ చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది” అని పేర్కొన్నారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకేముంది నెటిజన్ల నడుమ ఫ్యాన్ వార్ ముదిరింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది