Ram The Warriorr : కేక పెట్టిస్తున్న రామ్ న్యూ లుక్.. అదిరిపోయే టైటిల్ పెట్టిన మేక‌ర్స్

Authored By Sam C | The Telugu News | Published on: January 17, 2022, 1:30 pm

Ram: ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన రామ్ మ‌ళ్లీ అలాంటి హిట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం రామ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ ర్యాపో 19 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసి రివీల్ చేశారు. అలానే రామ్ ప‌వ‌ర్ ఫుల్ లుక్ విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరో రామ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు. ఖాకీ డ్రెస్ లో రామ్ పోతినేని స్టైలిష్ గా, కిల్లింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. రామ్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Ram The Warriorr ఖాకీ దుస్తుల్లో కేక పెట్టిస్తున్న రామ్

రామ్ పోతినేని 19వ సినిమాగా తెరకెక్కుతోన్న ది వారియ‌ర్ చిత్రాన్ని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత కోవిడ్ సెకెండ్ వేవ్ రావడంతో షూటింగ్‌ను మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన రెడ్యూలర్ షూటింగ్‌ను యూనిట్ ఆరంభించేసింది. అంతేకాదు, వరుసగా పలు షెడ్యూళ్లను కూడా చకచకా జరిపించేశారు. అలా అంతా సాఫీగా సాగిపోతోన్న సమయంలోనే హీరో రామ్ షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను మరోసారి ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Ram New Movie The Warriorr poster relaesed

Ram New Movie The Warriorr poster relaesed

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ది వారియర్’ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక, ఈ మూవీలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు కన్నడ భామ అక్షర గౌడను తీసుకున్నారని కూడా చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. విలన్ పాత్ర కోసం లింగుస్వామి ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకుని అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఆది పినిశెట్టి.. సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది ఫేమ్ నదియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp