Ram : రామ్ తో పాన్ ఇండియన్ సినిమా.. అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram : రామ్ తో పాన్ ఇండియన్ సినిమా.. అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా..?

 Authored By govind | The Telugu News | Updated on :25 February 2021,12:20 pm

Ram : రామ్ తో పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కబోతోందా .. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రామ్ అంతక ముందు వరసగా ఫ్లాప్స్ .. యావరేజ్ సినిమాలతో నెట్టుకొచ్చాడు. అయితే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ మొత్తం గా మారిపోయింది. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇంతకాలం ఎదురు చూసిన మాస్ ఇమేజ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చేసింది. ఈ ఇమేజ్ చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నాడు రామ్. ఈ క్రమంలోనే రెడ్ సినిమాలో నటించాడు. డ్యూయల్ రోల్ లో రామ్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ అన్న టాక్ వచ్చింది.

pan indian movie with ram is budget works out

pan-indian-movie-with-ram-is-budget-works-out

ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిన సినిమా మీద నమ్మకంతో రామ్ ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేసిననదుకు మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో రామ్ మరోసారి మాస్ ఎంటర్‌టైనర్ లో నటించేందుకే రెడీ అయ్యాడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ క్రేజ్ ఉన్న ఎన్.లింగు సామి దర్శకత్వంలో రామ్ తన నెక్స్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమా అధికారకమైన ప్రకటన కూడా వచ్చేసింది. రామ్ కెరీర్ లో 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రాబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిందట. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Ram : రామ్ సినిమాకి 75 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలోనూ.. ఇండస్ట్రీ వర్గాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత రామ్ సినిమాకి 75 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత బడ్జెట్ రామ్ తో వర్కౌట్ అవుతుందా.. అని చర్చించుకుంటున్నారట. మరి ఇంత బడ్జెట్ పెడుతున్నది నిజమా కాదా అన్నది మేకర్స్ నుంచి క్లారిటీ మాత్రం లేదు. కాగా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. శ్రీనివాస్ చిట్టూరి రామ్ 19 కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది