Ram Prasad Indirectly counter on roja makeup
జబర్దస్త్ కమెడియన్స్ వేసే పంచులకు కొదవే ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడికో కలుపుతూ నవ్వుల హరివిల్లులు కురిపిస్తుంటారు జబర్దస్త్ వీరులు. పక్కనుంది టీమ్ ప్లేయరా? లేక యంకరా? లేక జడ్జా? అనేది వాళ్లకు అస్సలు అవసరం లేదు. పంచ్ విసిరి పరేషాన్ చేశామా అన్నదే పాయింట్ అక్కడ. తాజాగా జరిగిన ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లో ఇలాగే రెచ్చిపోయాడు రాం ప్రసాద్. ఏకంగా రోజా మేకప్‌పై దారుణమైన కౌంటర్ వేసేశాడు.
Ram Prasad Indirectly counter on roja makeup
ప్రతి పండగకు ఇంటింటా నవ్వులు కురిపించడం మల్లెమాల స్టైల్. ఈ నేపథ్యంలోనే ఈ సారి దివాలి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి దానికి ”తగ్గేదే లే” అనే పేరు పెట్టారు. తాజాగా ఈ ప్రోగ్రాం తాలూకు ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో సీనియర్ హీరోయిన్స్ రోజా, ఇంద్రజ, ప్రియమణి సహా హైపర్ ఆది, రాం ప్రసాద్ బాగా హైలైట్ అయ్యారు. వేదికపై వాళ్లు వేసిన స్కిట్ ‘న భూతొ న భవిష్యత్’ అనేలా ఉంది.
ఓ సినిమా కోసం డైరెక్టర్ అవతారమెత్తిన హైపర్ ఆది.. ఐదుగురు హీరోయిన్లతో షూటింగ్ ప్లాన్ చేశాడు. ఆ హీరోయిన్లుగా రోజా, ఇంద్రజ, ప్రియమణిలను తీసుకున్నాడు. ముందుగా ఈ ముగ్గురినీ సెట్స్ మీదకు తీసుకురావడం, ఆ తర్వాత వాళ్లంతా తమ తమ రేంజ్ చూపిస్తూ స్టైల్ కొట్టడం తెగ ఆకర్షించింది. ఇక చివరగా రోజా అసిస్టెంట్‌గా ఎంటరైన రాం ప్రసాద్.. రోజాకు మేకప్ వేసే స్టెప్పుతో దారుణంగా అవమానించాడు. గోడకు సిమెంట్ వేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ రోజాకు మేకప్ వేసేశాడు. దీంతో ఈ జబర్దస్త్ పంచ్ చూసి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.